Manju Warrier: భర్త చేసిన మోసం.. కన్న కూతురు దూరం.. పడి లేచిన కెరటం మంజు వారియర్..

ఆమె రూపం ముందు కాలమే ఆగిపోయినట్లుగా ఉంటుంది ఆ అందం. 46 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోయిన్లకు పోటీనిస్తూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ మలయాళీ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది మంజు వారియర్. 1995లో సాక్ష్యం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. 18 ఏళ్ల వయసులోనే 'సల్లప'తో హీరోయిన్‌గా మారి నటనపరంగా ప్రశంసలు అందుకుంది.

Rajitha Chanti

|

Updated on: Sep 10, 2024 | 9:00 PM

ఆమె రూపం ముందు కాలమే ఆగిపోయినట్లుగా ఉంటుంది  ఆ అందం. 46 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోయిన్లకు పోటీనిస్తూ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ మలయాళీ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది మంజు వారియర్.

1 / 5
 1995లో సాక్ష్యం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. 18 ఏళ్ల వయసులోనే 'సల్లప'తో హీరోయిన్‌గా మారి నటనపరంగా ప్రశంసలు అందుకుంది. 'ఈ పూజయుం గడ్డన్' చిత్రంలో తన నటనకు ఉత్తమ నటిగా రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకుంది.

2 / 5
 కేవలం ఐదేళ్లలోనే 20 సినిమాల్లో నటించిన మంజు.. కన్నేయితి పొట్టుం తొట్టు చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుంది. 1998లో కెరీర్ మంచి పీక్ స్టేజ్ లో ఉండగా.. స్టార్ హీరో దిలీప్ ను వివాహం చేసుకుంది. పెళ్లైన ఏడాదికే సినిమాలకు దూరమయ్యింది.

3 / 5
వీరికి ఒక పాప జన్మించింది. 16 ఏళ్లు గడిచిన తర్వాత తన భర్త మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు. చివరకు 2015లో భర్త నుంచి విడాకులు తీసుకుంది.

4 / 5
 ఆ తర్వాత కూతురు కూడా తన తండ్రితో ఉంటానని చెప్పడంతో మానసిక వేదనకు గురైంది. ఎన్నో ఏళ్లు ఇంట్లోనే గడిచింది. ఆ తర్వాత 2014లో హౌ ఓల్డ్ ఆర్ యూ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన వేట్టయాన్ చిత్రంలో నటిస్తుంది.

5 / 5
Follow us