Tollywood: ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న అచ్చమైన తెలుగమ్మాయి.. ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా ఉండడం చాలా కష్టం. కానీ ఇప్పుడిప్పుడే కొందరు అమ్మాయిలు వెండితెరపై సత్తా చాటుతున్నారు. అందులో ఈ చిన్నారి ఒకరు. పైన ఫోటోలో అమాయకంగా కనిపిస్తోన్న చిన్నారి హీరోయిన్ అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనన్య.. హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసింది.