- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth prabhu demands 10 crores remuneration for her next web series with Varun Dhawan Telugu Heroines Photos
Samantha: రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే.. నేనింతే అంటున్న సమంత.!
సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా ఒంటబట్టాయా..? హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే.. రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారా..? ఏడాదిగా ఏం చేయని స్యామ్.. తన రెమ్యునరేషన్‌ను మాత్రం డబుల్ చేయడానికి కారణమేంటి.? అంత డిమాండ్ చేస్తున్నా.. దర్శక నిర్మాతలు సమంత వెంటే పడటం వెనక సీక్రేట్ ఏంటి.? కొందరు హీరోయిన్లకు సినిమాలు చేస్తేనే క్రేజ్ ఉంటుంది..
Updated on: Mar 21, 2024 | 1:59 PM

సమంతకు బాలీవుడ్ నీళ్లు బాగా ఒంటబట్టాయా..? హిందీలో ఒక్క సినిమా కూడా చేయకుండానే.. రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్నారా..? ఏడాదిగా ఏం చేయని స్యామ్.. తన రెమ్యునరేషన్‌ను మాత్రం డబుల్ చేయడానికి కారణమేంటి..?

అంత డిమాండ్ చేస్తున్నా.. దర్శక నిర్మాతలు సమంత వెంటే పడటం వెనక సీక్రేట్ ఏంటి.? కొందరు హీరోయిన్లకు సినిమాలు చేస్తేనే క్రేజ్ ఉంటుంది.. మరికొందరికి మాత్రం ఖాళీగా ఉన్నా ఆ ఇమేజ్ ఎక్కడికీ పోదు.

సమంత రెండో లిస్టులోకి వస్తారు. ఏడాదిగా సినిమాలే చేయని ఈ బ్యూటీ.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. మయోసైటిస్ కారణంగా బ్రేక్ తీసుకున్న ఈ భామ..

వడ్డీతో కలిపి మరీ నిర్మాతల నుంచి వసూలు చేయాలని ఫిక్సైపోయారు. తెలుగులో ఖుషీ తర్వాత సమంత సినిమాలేం చేయలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉన్నారు. అక్కడ సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు ఈ భామ.

వరుణ్ ధవన్ హీరోగా రాజ్ డికే తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సిరీస్‌లో నటించడానికి సమంత ఏకంగా 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు యాడ్స్‌కు కూడా భారీగానే వసూలు చేస్తున్నారు ఈ బ్యూటీ.

సిటాడెల్‌కు 10 కోట్లు తీసుకున్న సమంత.. సినిమాకు 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డివివి దానయ్య, విజయ్ సినిమాకు స్యామ్‌నే అడుగుతున్నారు. ఈ సినిమాకు ఆమె అడిగినంతా ఇచ్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదంటున్నారు ఫ్యాన్స్. అందుకే నిర్మాతలు కూడా స్యామ్ రెమ్యునరేషన్ విషయంలో ఏం మాట్లాడట్లేదు.




