- Telugu News Photo Gallery Cinema photos Director Sukumar and Ram Charan may announce new movie on Ram Charan's Birthday Telugu Heroes Photos
Ram Charan: బర్త్ డేకు రామ్ చరణ్ సంచలన నిర్ణయం.! ఇప్పటికి 2 ఇయర్స్ ఖాళీ.
గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్సైనా.. పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగ బట్టినపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? ఇన్నాళ్లూ రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఇదే జరిగింది. అందుకే ప్లాన్ అంతా మార్చేసారు మెగా వారసుడు. ఇక చూస్కోండి నా జోరు.. ఇప్పట్నుంచి కనిపించేది రామ్ చరణ్ 2.0 అంటున్నారాయన. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి..? అదేంటో కానీ కెరీర్ మొదట్నుంచీ రామ్ చరణ్‌ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది.
Updated on: Mar 21, 2024 | 2:02 PM

గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్సైనా.. పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగ బట్టినపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి..? ఇన్నాళ్లూ రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఇదే జరిగింది. అందుకే ప్లాన్ అంతా మార్చేసారు మెగా వారసుడు.

ఇక చూస్కోండి నా జోరు.. ఇప్పట్నుంచి కనిపించేది రామ్ చరణ్ 2.0 అంటున్నారాయన. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి..? అదేంటో కానీ కెరీర్ మొదట్నుంచీ రామ్ చరణ్‌ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది. దాన్ని అధిగమించాలని ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు.

అదే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవడం. చిరుత తర్వాత మగధీర కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.. కెరీర్ కొత్తలో కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీల్ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వరసగా ఏడాదికో సినిమా చేస్తూ వచ్చారు చరణ్.

2009లో మగధీర నుంచి 2019లో వినయ విధేయ రామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేసారు.. మధ్యలో 2011, 2017 మాత్రమే ఖాళీగా వదిలేసారు చరణ్. కానీ రాజమౌళితో RRR ఎప్పుడైతే కమిటయ్యారో.. అప్పట్నుంచి గ్యాప్ తప్పట్లేదు.

2020, 2021 ఖాళీగానే వెళ్లిపోయాయి. ఆ లోటు తీరేలా ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్లవుతుంది. దాంతో మళ్లీ భారీ గ్యాప్ తప్పట్లేదు. 2023లోనే వస్తుందనుకున్న గేమ్ ఛేంజర్ ఇంకా సెట్స్‌పైనే ఉంది.

మార్చి 21 నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇక దానికి ఒక్క రోజు ముందే మార్చి 20న బుచ్చిబాబు సినిమాకు ముహూర్తం పెట్టారు చరణ్. దీని రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి మొదలు కానుంది.

ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నారు బుచ్చిబాబు. కేవలం ఆర్నెళ్లలోనే RC16 షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారీయన. సమ్మర్ 2025కి ఈ చిత్రం రావడం ఖాయం. మరోవైపు మార్చి 27న సుకుమార్, చరణ్ సినిమాపై ప్రకటన రానుందని తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత సుక్కు చేయబోయే సినిమా ఇదే. ఈ మూడు సినిమాల్ని 2025లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్.




