- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya Thandel movie story and web series Arabia Kadali story both are same say fans
Thandel: తండేల్ సినిమాకు ఊహించని ముప్పు.. టెన్షన్ లో నాగ చైతన్య
నాగ చైతన్య సినిమాకు అనుకోని అడ్డంకులు రాబోతున్నాయా..? తండేల్ సినిమా నేపథ్యమంతా సముద్రమే.. ప్రయాణమంతా అలల మధ్యలోనే.. ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగడమే..! ఇప్పుడా కష్టాలు బయట కూడా వస్తున్నాయా...? సాఫీగా సాగుతున్న చైతూ సినిమాకు వచ్చిన అడ్డంకులేంటి..? అదే కథతో మరొకరు కూడా వస్తున్నారా..? నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా తండేల్. చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి.
Updated on: Mar 21, 2024 | 7:40 PM

నాగ చైతన్య సినిమాకు అనుకోని అడ్డంకులు రాబోతున్నాయా..? తండేల్ సినిమా నేపథ్యమంతా సముద్రమే.. ప్రయాణమంతా అలల మధ్యలోనే.. ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగడమే..! ఇప్పుడా కష్టాలు బయట కూడా వస్తున్నాయా...? సాఫీగా సాగుతున్న చైతూ సినిమాకు వచ్చిన అడ్డంకులేంటి..? అదే కథతో మరొకరు కూడా వస్తున్నారా..?

అజీజ్‌నగర్లోని గుంటూరు కారం సెట్లో నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. మలేషియా టౌన్ షిప్‌లో శ్రీనువైట్ల డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు గోపీచంద్.

దీనికోసం మత్స్యకారుల దగ్గరికి కూడా వెళ్లారు మేకర్స్. తండేల్‌లో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ తాజాగా అరేబియన్ కడలి అనే వెబ్ సిరీస్ ప్రకటించారు క్రిష్.

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రెండు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లి.. ఇతర దేశపు బోర్డర్ క్రాస్ చేస్తారు.. దాంతో వాళ్లనక్కడ ఖైదు చేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది కథ. తండేల్ కథలో పాకిస్తాన్ అని పక్కగా చెప్తే.. అరేబియన్ కడలి సిరీస్‌లో మాత్రం దేశం పేరు చెప్పలేదు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీని కూడా కలిపి 40 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా తండేల్.




