Samantha: న్యూయర్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్ లో సమంత సందడి.. పిక్స్ వైరల్
హీరోయిన్ సమంత.. రీసెంట్‌గా అమెరికా వెళ్లింది. నార్మల్‌గా అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ గత కొన్నాళ్ల నుంచి ఓ అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతోంది. దీంతో ఈ టూర్.. చికిత్స కోసమే అని రకరకాల రూమర్స్ వచ్చాయి. మరి ఈ ప్రయాణం వెనక అసలు విషయం ఇప్పుడు తెలిసిపోయింది. ఫొటోలు, వీడియోలు బయటపడటంతో అసలు విషయం బయటపడింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయర్క్‌లో 'ఇండియా డే పరేడ్' వేడుకల్ని నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఇవి గ్రాండ్‌గా జరిగాయి.