- Telugu News Photo Gallery Cinema photos Samantha beautiful photos in saree have fans reacting to this
చీరలో సన్నజాజి తీగలా.. సమంత లేటెస్ట్ ఫొటోస్ చూశారా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. అంతే కాకుండా సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతూ, ఈ బ్యూటీ మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత, అప్పుడప్పుడు తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ.. తన అందాలతో అభిమానులను సప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా చీరలో ఉన్నఫొటోస్ షేర్ చేసింది.
Updated on: Apr 08, 2025 | 8:41 PM

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాయ చేశావే అంటూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, కుర్రకారు మనసు దోచేసింది ఈ చిన్నది. మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సమంతకు లక్కు కలిసి వచ్చింది.

ఈ మూవీ తర్వాత వరసగా ఆఫర్స్ రావడం మొదలు పెట్టాయి. దీంతో తెలుగులో వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసి, స్టార్ హీరోయిన్ గా తన సత్తాచాటింది ఈ చిన్నది.

అంతే కాకుండా సమంత చేసిని సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయిపోంది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ , మాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నసమయంలోనే ఈ అమ్మడు వివాహం, డివోర్స్ ,మయోసైటీస్ ఇలా అనేక సమస్యలతో సతమతమయ్యి, కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, వెకేషన్స్ కు వెళ్తూ, తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది.

ఇక మల్లీ సెకండ్ హిన్సింగ్స్ స్టార్ట్ చేసిన సమంత, పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ బ్యూటీ చీరలో అందంగా తయారై ఫొటోలకు ఫోజులిచ్చింది. వీటిని చూసిన తన అభిమానులు చీరలో సన్నజాజి తీగలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.



