- Telugu News Photo Gallery Cinema photos Prabhas's Busy Schedule Directors' Strategies to Secure Film Shoots
Prabhas: ప్రభాస్ అంటే ఆ మాత్రం పక్కా ప్లానింగ్ ఉండాలి మామా.. అక్కడ ఉంది డార్లింగ్ కదా
ప్రభాస్‌తో సినిమా చేయడం అంటే ఆయనకు కథ చెప్పి ఒప్పించినంత ఈజీ కాదు.. అసలు సినిమా అంతా అక్కడ్నుంచే మొదలవుతుంది. ప్రాజెక్ట్ ఓకే అయిన రోజు నుంచి.. పట్టాలెక్కే వరకు దర్శకులకు టెన్షన్ తప్పదు. ఈ లిస్టులో మరో దర్శకుడు చేరిపోయాడు.. కాకపోతే ఆ ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ దర్శకులంతా సేమ్. ఇంతకీ ఏంటది..?
Updated on: Sep 18, 2025 | 8:44 PM

ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి ఆయనతో సినిమాలకు కమిటైన దర్శకులకు డేట్స్ ఎప్పుడు ఇస్తారో.. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ఎప్పటికి పూర్తవుతాయో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు ఓకే చేయడంతో.. ఎవరి టోకన్ నెంబర్ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు.

ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలు పూర్తయ్యాక.. స్పిరిట్ సెట్స్‌పైకి రానుంది.ప్రభాస్‌తో సినిమా అంటే ఎలాగూ ఆలస్యమవుతుందని తెలుసు.. అందుకే ఆయన వచ్చే లోపే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేస్తున్నారు దర్శకులు.

సందీప్ రెడ్డి వంగా ఇదే చేస్తున్నారు. షూట్ మొదలవ్వక ముందే 70 శాతం రీ రికార్డింగ్ పూర్తి చేయడంతో పాటు.. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసారు. ప్రభాస్ వచ్చిన వెంటనే.. సూపర్ ఫాస్టుగా షూట్ చేయడమే తరువాయి.

సందీప్ రెడ్డి వంగా దారిలోనే ప్రశాంత్ వర్మ కూడా వెళ్తున్నారిప్పుడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో హోంబలే ఫిల్మ్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అన్నీ ముందే రెడీ చేసుకుంటున్నారు ప్రశాంత్. కొన్ని రోజులుగా ఈయన ఖాళీగానే ఉన్నారు.. ఈ గ్యాప్‌లోనే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ వర్క్ పూర్తి చేశారు.

సినిమాలో వచ్చే ప్రతీ షాట్ డిజైన్ చేసారు ప్రశాంత్ వర్మ. ప్రీ ప్రొడక్షన్ 100 శాతం పూర్తి కావడంతో.. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా మూన్నెళ్లలోపే షూట్ పూర్తి చేయాలనేది ప్రశాంత్ వర్మ ప్లాన్. కానీ స్పిరిట్ తర్వాత కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. ఇవన్నీ అయ్యాకే ప్రశాంత్ సినిమాకు ప్రభాస్ డేట్స్ ఇస్తారా లేదంటే ముందే సెట్స్‌పైకి తీసుకొస్తారా అనేది చూడాలి.




