- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Film Flop In Theatres and Trending In Amazon OTT, That Is Maalik
Cinema : థియేటర్లలో డిజాస్టర్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీలో విడుదలైన ఒక సినిమా ఇప్పుడు దూసుకుపోతుంది. కానీ అంతకు ముందు థియేటర్లలో మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం టాప్ 10లో చోటు దక్కించుకుంటారు. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఆ సినిమాకు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?
Updated on: Sep 18, 2025 | 8:18 PM

2025లో వచ్చిన ఒక సినిమా భారీ ఆర్భాటంతో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇప్పుడు, అదే సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. ఈ యాక్షన్- ప్యాక్డ్ దేశీ సినిమా టాప్ ట్రెండింగ్ జాబితాలో చోటు సంపాదించుకుంది. మనం మాట్లాడుతున్న సినిమా పేరు "మాలిక్".

పుల్కిత్ దర్శకత్వంలో 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇందులో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మానుషి చిల్లార్ కథానాయికగా నటించింది. ఇందులో సౌరభ్ శుక్లా, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, తిగ్మాన్షు ధులియా, సౌరభ్ సచ్‌దేవా, అన్షుమాన్ పుష్కర్ కూడా నటించారు.

ఈ సినిమా కథ 1980ల నాటి అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) నేపథ్యంలో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు నేర ప్రపంచంలోకి ఎలా ప్రవేశించి గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడో ఈ సినిమా చూపిస్తుంది. రాజ్‌కుమార్ రావు దీపక్ పాత్రలో నటించాడు.

రాజ్ కుమార్ కుమార్ రావు "మాలిక్" బాక్సాఫీస్ వద్ద విజయం డిజాస్టర్ అయ్యింది. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో దూసుకుపోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై త్వరగా టాప్ 10 జాబితాలో చేరింది.

భారతదేశంలో ₹22.86 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹26.3 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఓటీటీలో దూసుకెళ్లింది.




