- Telugu News Photo Gallery Cinema photos Madonna sebastian latest beautiful photos goes viral on internet
Madonna Sebastian: అందంతో గత్తర లేపుతున్న మడోన్నా సెబాస్టియన్.. ఫొటోస్ అదుర్స్
అందాల భామ మడోన్నా సెబాస్టియన్.. ఈ అమ్మడు అక్టోబర్ 1, 1992న కేరళలోని చెరుపుజలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ స్టడీలో పట్టా అందుకుంది. ఈ అమ్మడు మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది.
Updated on: Sep 18, 2025 | 1:58 PM

అందాల భామ మడోన్నా సెబాస్టియన్.. ఈ అమ్మడు అక్టోబర్ 1, 1992న కేరళలోని చెరుపుజలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ స్టడీలో పట్టా అందుకుంది.

ఈ అమ్మడు మొదట మలయాళంలో విడుదలైన ఒక మ్యూజిక్ షోలో యాంకర్‌గా పని చేసింది. ఈ షో ద్వారా ఫేమస్ అయ్యి తొలిసారి సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. అలాగే సినిమాల్లోనూ మంచి సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉంటే అల్ఫోన్స్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, సాయి పల్లవి, మడోనా, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "ప్రేమమ్" చిత్రం 2015లో విడుదలైంది. ఈ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దీని తరువాత, ఆమె 2016లో నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన విజయ్ సేతుపతి చిత్రం వాలంతుమ్ పార్థియంతో తమిళ తెరపైకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో నాగ చైతన్య నటించిన ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది.

చాలా కాలం తర్వాత నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం మడోనా తెలుగు సినిమాల కంటే తమిళ్, మలయాళ సినిమాల పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు.




