- Telugu News Photo Gallery Cinema photos Prabhas Rajasaab to Samantha review for Pushpa 2 song latest film updates from movie industry
Movie Updates: రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్.. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సామ్ రివ్యూ..
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ షూటింగ్‌కు సంబంధించి మరో అప్‌డేట్. పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు సమంత రివ్యూ. లేటెస్ట్ ఇంటర్వ్యూలో విడాకుల వార్తలకు చెక్ పెట్టారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. తన మాజీ భార్య కిరణ్ రావు గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్.
Updated on: Nov 29, 2024 | 9:08 AM

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ షూటింగ్‌కు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నెక్ట్స్ షెడ్యూల్‌లో ప్రభాస్, మాళవిక మోహన్‌పై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రకరణకు రెడీ అవుతున్నారు. ఈ షూటింగ్ వచ్చే నెల యూరప్‌లో జరగనుంది.

పుష్ప 1లో స్పెషల్ సాంగ్ చేసిన సమంత, పుష్ప 2 స్పెషల్ సాంగ్‌కు రివ్యూ ఇచ్చారు. కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల చంపేశారంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు సామ్. చెన్నైలో జరిగిన భారీ ఈవెంట్‌లో రిలీజ్ అయిన కిస్సిక్ సాంగ్ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది పుష్ప 2.

లేటెస్ట్ ఇంటర్వ్యూలో విడాకుల వార్తలకు చెక్ పెట్టారు బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. 'ఐ వాంట్ టు టాక్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన అభిషేక్, ' తాను సినిమాలు చేయగలుగుతున్నానంటే అందుకు కారణం ఐశ్వర్యే' అన్నారు. ఆమె ఇంటిని బాగా చూసుకోవాటం వల్లే తాను సినిమాల మీద కాన్సన్‌ట్రేట్ చేయగలుగుతున్నా అన్నారు.

బ్రేకప్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ నటి మల్లికా శెరావత్. లాంగ్ బ్రేక్ తరువాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తాను సింగిలే అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న ఈ బ్యూటీ, భవిష్యత్తులో సరైన వ్యక్తి కలిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తా అన్నారు.

తన మాజీ భార్య కిరణ్ రావు గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. కోవిడ్ సమయంలో తాను సినిమాలు మానేయాలని నిర్ణయించుకుంటే, కిరణే వద్దని వారించారని చెప్పారు. కిరణ్ దర్శకత్వంలో ఆమిర్ నిర్మించిన లాపతా లేడీస్ ఆస్కార్ ప్రమోషన్ సందర్బంగా ఈ కామెంట్స్ చేశారు ఆమిర్ ఖాన్.




