- Telugu News Photo Gallery Cinema photos This actress had Fake videos of her at career start, now is famous actress Anikha Surendran
16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే
ఎంత చేసిన కొంతమంది కేటుగాళ్ల బుద్ధిమారడం లేదు. హీరోయిన్స్ ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి శునకానందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కు కూడా జరిగింది.
Updated on: Nov 29, 2024 | 1:50 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న హీరోయిన్స్ వరుకు చాలా మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. కొంతమంది దీనిని సీరియస్ గా తీసుకున్నారు కూడా..

ఎంత చేసిన కొంతమంది కేటుగాళ్ల బుద్ధిమారడం లేదు. హీరోయిన్స్ ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి శునకానందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కు కూడా జరిగింది.

చిన్న వయసులోనే ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలను నెట్టింట వైరల్ చేశారు. ఇండస్ట్రీలో ఎదగాలనుకున్న ఆమె కోరికలను తొక్కేయాలని అనుకున్నారు. కానీ ఆమె వాటిని అధిగమించి ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యింది.

ఆమె మరెవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి,.. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతున్న అనిఖా సురేంద్రన్. ఈ చిన్నది అజిత్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్లకే వీడియోలు , ఫోటోలు లీక్ అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

కానీ అవి ఫేక్ అని తేలిపోయింది. ఇక 18 ఏళ్ల వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడు బుట్టబొమ్మ అనే సినిమా చేసింది. ఇప్పుడు ఈ చిన్నది తెలుగు, తమిళ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.




