- Telugu News Photo Gallery Cinema photos Ram Charan new movie to Kriti Sanon Comments latest movie news from film industry
Film News: చెర్రీతో కన్నడ దర్శకుడు మూవీ.. నెపోటిజంపై కృతి సనన్ వ్యాఖ్యలు..
తన మూవీని రామ్ చరణ్ హీరోగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న కన్నడ దర్శకుడు. కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిపిన నయనతార. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లవ్ అండ్ వార్ లేటెస్ట్ అప్డేట్. విజయ్ సేతుపతి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విడుదలై 2. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కృతి సనన్.
Updated on: Nov 29, 2024 | 8:28 AM

భైరతి రణగల్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న కన్నడ దర్శకుడు నార్తన్, తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో నెక్ట్స్ మూవీ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసిన నార్తన్, ఆ మూవీని రామ్ చరణ్ హీరోగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లవ్ అండ్ వార్. రణబీర్ కపూర్, విక్కీ కౌషల్, అలియా భట్ లీడ్ రోల్స్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం భారీ సెట్‌లో విక్కీ, అలియా కాంబినేషన్‌లో డిస్కో సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

విజయ్ సేతుపతి హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విడుదలై 2. ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సూరి, మంజు వారియర్ కీలకపాత్రల్లో నటించారు. డిసెంబర్ 20న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కృతి సనన్. మీడియా, ప్రేక్షకులే నెపోటిజంకు కారణమన్నారు కృతి. 'వాళ్లు స్టార్ కిడ్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ హైప్ వల్లే దర్శక నిర్మాతలు స్టార్ కిడ్స్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తార'న్నారు.




