పెయిడ్ ప్రీమియర్స్ వల్ల ఉపయోగం లేనట్టేనా ??
బీ ఓపెన్ అనే మాట ఎక్కడైనా చెల్లుతుందేమోగానీ, సినిమా ఇండస్ట్రీలో కాదు. సినిమాను ఎంత గుట్టుగుట్టుగా తీసినా... ఎంత చాటుగా కాపాడినా... అంతా రిలీజ్ అయ్యే వరకే.. ఒక్క షో పడితే చాలు.. మంచేటి, చెడేంటి... ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? అంటూ మైకులు ముందు భేషుగ్గా మాట్లాడేసుకుంటారు. అలాంటప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ అవుతున్నాయా? మైనస్ అవుతున్నాయా?
Updated on: Nov 26, 2024 | 9:58 PM

సాలిడ్ కంటెంట్ ఉండి, సినిమా హిట్ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ గట్టిగా ఉన్నప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ చాలా ప్లస్ అవుతాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ది బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న పెళ్లి చూపులు సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ విపరీతమైన పాజిటివ్ బజ్ తెచ్చిపెట్టాయి.

సినిమా బావుండాలేగానీ, మౌత్ టాక్‌తో ఆడుతుందనే నమ్మకాన్ని మేకర్స్ లో పెంచేశాయి పెయిడ్ ప్రీమియర్స్. 35 చిన్న కథకాదు తరహా సినిమాలకు కూడా ప్లస్ అయ్యాయి.

ఈ మధ్య దసరా సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ మంచే చేశాయి. కానీ, అతి నమ్మకానికి పోయి సినిమాను జనాలకు ముందే చూపిస్తే.. మొదటికే మోసం వచ్చిన అనుభవం కూడా కొందరు హీరోలకు లేకపోలేదు.

అందరూ చేస్తున్నారని, సినిమాలను ముందే చూపించేస్తే ఓపెనింగ్స్ కూడా కరవైపోతాయనే విషయాన్ని మేకర్స్ అర్థం చేసుకోవాలి. పెయిడ్ ప్రీమియర్స్ అనేది విధానం కాదు.

ప్రాడెక్ట్ మీదున్న నమ్మకం అనే అవగాహన క్రియేట్ అయితే... జరగబోయే నష్టాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చన్నది అనుభవజ్ఞుల మాట. అలా కాకుండా అదేదో ఫ్యాషన్ అనుకుని ఫాలో అయితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు క్రిటిక్స్.




