Naga Chaitanya: రూ.100 కోట్ల బడ్జెట్‌తో నాగచైతన్య..తండేల్ తర్వాత తగ్గేదేలే
ఒన్.. టూ.. త్రీ... ఇలా మీరు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేయండి.. ఇంకోటి... ఇంకోటి అంటూ నేను గుడ్‌న్యూస్‌లు చెబుతూనే ఉంటాను అంటున్నారు నాగచైతన్య. పర్సనల్ లైఫ్‌లోనూ, ప్రొఫెషనల్ లైఫ్లోనూ బాగా జోష్ మీదున్నారు చైతూ. అందుకే మంచి విషయాలను పంచుకుంటూ ఉన్నారు. బుజ్జితల్లీ వచ్చేత్తున్నాను గదే.. అంటూ ఇన్నాళ్లూ ఊరించిన నాగచైతన్య.. ఇప్పుడు ఏకంగా పాటతోనే మెప్పిస్తున్నారు.
Updated on: Nov 26, 2024 | 9:45 PM

Naga Chaitanya (1)

Naga Chaitanya (2)

పదే పదే వినాలనిపించేలా ఉందని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి తండేల్ సాంగ్స్. ఫిబ్రవరిలో తండేల్ మూవీ నేషనల్ వైడ్ చైతూ క్రేజ్‌ని యమాగా స్ప్రెడ్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది సినిమా యూనిట్‌లో.

డిసెంబర్‌లో శోభిత మెడలో మూడు ముళ్లు వేసి ఓ ఇంటివాడు కానున్న చైతూ ఆ వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని తండేల్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేసేస్తారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నయా మూవీని ప్రకటించేశారు.

టెన్‌టేటివ్‌గా ఎన్‌సీ24 అని పిలుస్తున్నారు. పౌరాణిక కథ నేపథ్యంలో కార్తిక్ దండు తెరకెక్కిస్తున్నారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో సుకుమార్ రైటింగ్స్, ఎస్వీ సీసీ తెరకెక్కిస్తున్నాయి. 2025కి ముందు.. 2025 తర్వాత.. అని కెరీర్‌ని స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటున్నారు చైతూ.




