Suriya and Jyothika: కర్నాటకలోని మూకాంబికై ఆలయాన్ని సందర్శించిన సూర్య, జ్యోతిక
తాజాగా స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక దైవ దర్శనం కోసం కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికై ఆలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.
Suriya And Jyothika
Follow us
స్టార్ హీరో సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక దైవ దర్శనం కోసం కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ కొల్లూరు మూకాంబికై ఆలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.
స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూర్యకి మొదట్లో నటనపై ఆసక్తి లేదు మరియు చిన్నప్పటి నుండి దర్శకుడిని కావాలనుకున్నాడు.
సూర్య తన చదువు పూర్తయ్యాక నటన రంగంలోకి రాకముందు కార్మెన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. సూర్య 1997లో వసంత్ దర్శకత్వంలో మణిరత్నం ‘నెరుకు నేర్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన కాక్క కాక్క చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆయన నటించిన గజిని, సింగం లాంటి ఎన్నో సినిమాలు టాలీవుడ్ లోనూ రిలీజ్ అయ్యి భారీ హిట్స్ అందుకున్నాయి.