- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya Says About Her Wife Shobitha and Personal Life
Naga Chaitanya: మా మధ్య గ్యాప్ రాకుండా కొన్ని రూల్స్ పెట్టుకున్నాం.. నాగచైతన్య..
యువసామ్రాట్ నాగచైతన్య ఇటీవల తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమాతోపాటు ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించగా.. చైతూ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
Updated on: Jul 27, 2025 | 2:06 PM

టాలీవుడ్ హీరో నాగచైతన్య చివరగా తండేల్ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ... తన సినిమాలతోపాటు పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన భార్య శోభితను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుస్తానని అన్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాని.. ఇద్దరి మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతామని అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేస్తామని అన్నారు.

సినిమాలు చూడడం, నైట్ షికారుకు వెళ్లడం.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లేదా వంట చేసుకోవడం.. ఇలా ప్రతి క్షణాలను మధుర జ్ఞాపకంగా మార్చుకుంటామని అన్నారు. శోభితకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం.. నాకు రేసింగ్ పై ఆసక్తి అని అన్నారు.

ఇద్దరం కలిసి హాలీడే ప్లాన్స్ వేస్తామని.. ఇటీవల తనకు రేస్ ట్రాక్ పై డ్రైవింగ్ సైతం నేర్పించినట్లు తెలిపారు. ఇక షోయు గురించి ఎన్టీఆర్ జపాన్ లో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు. తనకు పెద్ద కోరికలు లేవని.. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

ఇద్దరు పిల్లలు ఉండాలని.. కొడుకు పుడితే రేస్ ట్రాక్ కు తీసుకెళ్తా అని.. కూతురు పుడితే తన అభిరుచులను ప్రోత్సహిస్తానని అన్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను మళ్లీ వాళ్లతో గడపాలని ఉందని అన్నారు.




