Christmas Movies: క్రిస్మస్ నెలలో సినిమాల సందడి.. డిసెంబర్‎లో రానుంది ఎవరు.?

దసరా, దీపావళి సీజన్ అయిపోయిందంటే.. సాధారణంగా అందరి చూపులు సంక్రాంతి మీదే ఉంటాయి. కానీ పొంగల్ కంటే ముందు బాక్సాఫీస్‌ను ఉప్పొంగించే సీజన్ మరోటి ఉంది.. అదే క్రిస్మస్. ఈ సారి ఈ సీజన్‌లో చాలా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ లాస్ట్ వీక్ అంతా సినిమాలతో మోగ మోగిపోనుంది. మరి అవేంటి..?

Prudvi Battula

|

Updated on: Nov 27, 2024 | 4:00 PM

డిసెంబర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పుష్పరాజ్. డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. పుష్ప 2 వచ్చిన రెండు వారాల పాటు బన్నీని ఎవరూ డిస్టర్బ్ చేయట్లేదు.

1 / 5
మళ్లీ డిసెంబర్ 20 నుంచి జాతర మొదలు కానుంది. ఆ రోజే సారంగపాణి జాతకం విడుదల కానుంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. అల్లరి నరేష్ బచ్చల మల్లి రిలీజ్ డేట్ సైతం డిసెంబర్ 20నే రానుంది. సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

2 / 5
ఇక నితిన్ రాబిన్ హుడ్ డిసెంబర్ 25న విడుదల కానుంది. క్రిస్మస్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు నితిన్. ఛలో తర్వాత వెంకీ కుడములతో నితిన్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో శ్రీలీల హీరోయిన్. 

3 / 5
మన తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా డిసెంబర్ చివరి వారం బాగానే వస్తున్నాయి. అందులో విజయ్ సేతుపతి, వెట్రిమారన్ కాంబోలో వస్తున్న విడుదల 2 ఒకటి. డిసెంబర్ 20నే ఇది రానుంది. విడుదల సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో.. పార్ట్ 2పై ఆసక్తి బాగానే ఉంది.

4 / 5
డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ఎన్ని సినిమాలు వస్తున్నా కూడా.. అందులో అగ్ర తాంబూలం అందుకునే సినిమా మాత్రం ముఫాసా: ది లయన్ కింగ్. వాల్డ్ డిస్నీ నుంచి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌కు తోడు.. లయన్ కింగ్ బ్రాండ్ ఈ సినిమాకు బలం. మొత్తానికి డిసెంబర్ చివరి వారం అంతా కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడనుంది.

5 / 5
Follow us