- Telugu News Photo Gallery Cinema photos Kerala film industry shows its strength by earning Rs 1000 crore in the first 5 months of 2024
Kerala Story: మలయాళీ ఇండస్ట్రీకి 2024 మరువలేని జ్ఞాపకం.. ఎందుకలా.?
ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. 2024 అయితే వాళ్ల ఇండస్ట్రీకి తీపిగుర్తుగా నిలిచిపోతుంది. చాలా ఇండస్ట్రీలకు సాధ్యం కాని రికార్డులను మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది సాధించింది. దీనిపైనే ఓ స్పెషల్ స్టోరీ చూద్దామా..?
Updated on: Feb 23, 2025 | 5:30 PM

మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు. లెజెండ్‌లో బాలయ్య ఒకడు వాళ్లకు ఎదురెళ్లినా.. వాళ్లకు ఒకడు ఎదురొచ్చినా కేరళ సినిమాల దెబ్బకు మటాష్ అయ్యేలా ఉన్నారు. అంతగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి అక్కడి సినిమాలు.

2024లోని తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా అదే దూకుడు చూపించింది మల్లూవుడ్. తెలుగు ఇండస్ట్రీకి పోటీగా 2024లో మలయాళం సినిమాలు కూడా అద్భుతాలు చేసాయి.

అలాగే మంజుమ్మల్ బాయ్స్ 250 కోట్లు.. ప్రేమలు 140 కోట్లు.. ఫహాద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితం 175 కోట్లు.. మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు.. టొవీనో థామస్ అన్వేషిప్పన్ కొండెతుమ్ 50 కోట్లు.. ARM 120 కోట్లు.. ఇలా సాగింది 2024లో మలయాళ ఇండస్ట్రీ దూకుడు.

2024 తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసాయి అక్కడి సినిమాలు. టాలీవుడ్‌కు కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. సెకండాఫ్‌లో కల్కి, దేవర, పుష్ప 2 రూపంలోనే మనకు 3500 కోట్లు వచ్చాయి.

కానీ మలయాళ సినిమాలైతే మొదట్లోనే దుమ్ము దులిపేసాయి. ఎలా చూసుకున్నా 2024 వాళ్లకు తీపిగుర్తుగా మిగిలిపోనుంది. 2025లో కూడా ఇదే కొనసాగితే టాప్ ప్లేస్ కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మలయాళ ఇండస్ట్రీకి.. ఈ ఏడాది కూడా ఇది రిపీట్ అయితే కేరళ ఇండస్ట్రీకి టాప్ ప్లేస్ పక్క.




