Nag Ashwin: కల్కి 2కి టైం పడుతుందా.? ఈ గ్యాప్‌లో నాగీ మరో సినిమా చేస్తారా..?
ప్రభాస్ జోరు చూస్తుంటే కల్కి 2 వచ్చేలోపు మరో మూడు సినిమాలు చేసేలా కనిపిస్తున్నారు.. అలాగే వైజయంతి బ్యానర్‌లోనూ రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. మరి దర్శకుడు నాగ్ అశ్విన్ పరిస్థితేంటి..? కల్కి 2 అంటూ అలాగే ఉంటారా..? లేదంటే ఈ గ్యాప్‌లో మరో సినిమా ఏదైనా చేస్తారా..? ఒకవేళ చేస్తే నాగీ ఎలాంటి సినిమాతో రావాలనుకుంటున్నారు..?
Updated on: Feb 23, 2025 | 6:00 PM

కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ రేంజ్ మారిపోయింది. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్‌గానే ఉన్న ఈయన.. ఇప్పుడేకంగా ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయారు. తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు నాగీ. ప్రస్తుతం కల్కి 2 పనుల్లో బిజీగా ఉన్నారీయన.

కల్కి అనేది ఒక్క భాగం కాదని.. ఇదో ఫ్రాంచైజీ అని ఇదివరకే చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. అయితే అవన్నీ ఒకేసారి సిరీస్‌లా చేయాలని లేదు.. వీలు దొరికనప్పుడల్లా చేస్తూ పోతానని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ప్రస్తుతం కల్కి 2తోనే నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నారా లేదంటే మరో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.


ఈలోపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం నాగీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. మహానటి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో చరిత్ర సృష్టించారు నాగీ.

అలియాతో పాన్ ఇండియన్ సెన్సేషన్ చేయాలని చూస్తున్నారు. పైగా అలియా కూడా బాలీవుడ్‌లో ఈ తరహా కథలు ఎక్కువగా చేస్తున్నారు. మొత్తానికి ఈ కాంబో కలిస్తే ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.




