- Telugu News Photo Gallery Cinema photos Venky Atluri is applying the same formula for a hat trick hit.
Venky Atluri: హ్యాట్రిక్ హిట్ కోసం సేమ్ ఫార్ములా.. వెంకీ పక్కా ప్లాన్
కొన్నిసార్లు కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు జస్ట్ అలా క్లిక్ అయిపోతుంది. అరే... భలే సక్సెస్ అయ్యామని సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు... అది కూడా బంపర్ బొనాంజా అయిందనుకోండి.. ఇక మూడు, నాలుగూ అంటూ తిరిగి చూసుకోకుండా ఆ ప్యాటన్ని ఫాలో అయిపోతుంటాం. ఇప్పుడు వెంకీ అట్లూరి చేస్తున్నది కూడా అదేనా... లేకుంటే ఇంకేమైనా రీజన్ ఉందా?
Updated on: Feb 23, 2025 | 6:45 PM

అప్పుడెప్పుడో రంగ్‌దేతో తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కామా పెట్టేశారు యంగ్ డైరక్టర్ వెంకీ అట్లూరి. ఆయన చేసిన సార్ సినిమా బౌండరీలు బద్ధలు కొట్టి సక్సెస్ కావడంతో ఆ తర్వాత కూడా సేమ్ సిలబస్‌ని ఫాలో అవుతున్నారు వెంకీ.

సార్ తర్వాత వెంకీ అట్లూరి చేసిన సినిమా లక్కీ భాస్కర్. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానే. పీరియాడిక్ టచ్ ఉన్న మూవీనే. సార్‌తో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని టచ్ చేసిన వెంకీ, లక్కీ భాస్కర్‌లో ఆర్ధిక నేరాల గురించి సెన్సిబుల్‌గా చెప్పారు.

తీసుకున్న పాయింట్ కన్నా, దాన్ని డ్రైవ్ చేసే తీరుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు వెంకీ. లేటెస్ట్గా ఆయన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తారనే టాక్ వైరల్ అవుతోంది.

ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఎయిటీస్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ సాగుతుందట. సో, ఆల్రెడీ ఈ ప్యాటర్న్‌లో రెండు సక్సెస్‌లు కొట్టిన డైరక్టర్, హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారన్నమాట.

అంతా బాగానే ఉంది.. పాయింట్ లెవల్లోనే కాన్సెప్ట్ హిట్ అని ప్రూవ్ అవుతున్నప్పుడు మన హీరోలతో వెంకీ ఎందుకు మూవీస్ చేయడం లేదు.. ఇక్కడివారు ఆయన సబ్జెక్టులకు ఓకే చెప్పడం లేదా? లేకుంటే పొరుగు హీరోలైతే మార్కెట్ స్పాన్ పెరిగి, పెట్టుబడికన్నా ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని కెప్టెన్ స్కెచ్ వేస్తున్నారా? ఏదేమైనా మంచి సబ్జెక్టులను మన వాళ్లు మిస్ చేసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. హిట్ సబ్జెక్టుకు ఓకే చెప్పాలంటే లక్ కూడా ఉండాలంటున్నారు నెటిజన్లు.




