AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhaava: బాలీవుడ్‎కి ఊపిరి పోసిన ఛావా.. రానున్న సినిమాలు ప్లస్ కానుందా.?

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాడుకుంటున్నారు బాలీవుడ్ నిర్మాతలిప్పుడు. దానికి కారణం కూడా లేకపోలేదు. అప్పుడెప్పుడో గతేడాది స్త్రీ 2 తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ బాక్సాఫీస్ కళకళలాడింది లేదు. పుష్ప 2 హిట్టైనా.. అది మన సినిమానే. చాలా రోజుల తర్వాత మరాఠా యోధుడి కథతో బాక్సాఫీస్ ఎరుపెక్కుతుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 23, 2025 | 7:00 PM

Share
పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి వెలిగిపోతుంది. ఛావా సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది ఛావా. ఈ దూకుడు చూస్తుంటే 400 కోట్లు ఈజీనే అనిపిస్తుంది.

1 / 5
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ బయోపిక్ ఇది. మొఘల్ సామ్రాజ్యంపై ఆయన చేసిన దండయాత్రలతో పాటు.. ప్రజలపై ఆయన చూపించిన వాత్సల్యాన్ని ఈ సినిమాలో చాలా బాగా ఆవష్కరించారు దర్శకుడు లక్ష్మణ్. దాంతో కేవలం మహారాష్ట్రలోనే కాదు.. అన్ని సిటీస్‌లోనూ అదరగొడుతుంది ఛావా.

2 / 5
ఛావా కోసం ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు శిక్షణ తీసుకున్నా. ఆ శిక్షణ వల్ల నా జీవితంలో క్రమశిక్షణ అలవాటైంది అని విక్కీ కౌశల్‌ చెప్పినప్పుడు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసినన్ని రోజులూ విక్కీ.. గాయాలను లెక్కపెట్టలేదు. లక్ష్యపెట్టలేదు. జస్ట్ మనసు పెట్టి మూవీ చేశారంతే!

3 / 5
ఛావా సినిమాలో శివాజీ మహరాజ్‌ తనయుడు శంభాజీ చేసిన సాహసాలను, ఆయన శౌర్యాన్నీ చెప్పారు మేకర్స్. నమ్మిన ధర్మాన్ని, తనవారిని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటాల గురించి ప్రస్తావించారు.

4 / 5
గతేడాది స్త్రీ 2 తర్వాత మరే హిందీ సినిమాకు వందల కోట్ల వసూళ్లు రాలేదు. బాలీవుడ్ మళ్లీ గాడి తప్పుతుందా అనుకుంటున్న సమయంలో ఛావాకు వస్తున్న వసూళ్లు చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఊపు రాబోయే సినిమాలకు ఉపయోగపడితే అదృష్టమే. త్వరలోనే సికిందర్‌తో రాబోతున్నారు సల్మాన్ ఖాన్. 

5 / 5