- Telugu News Photo Gallery Cinema photos Heroine malavika mohanan talk about Prabhas in The Raja Saab Movie, Details Here
Malavika Mohanan: నువ్వు దేవతవి తల్లీ.! మాళవికకు ప్రభాస్ ఫ్యాన్స్ దండాలు..
ప్రభాస్ సినిమాల గురించి చిన్న అప్‌డేట్ తెలిస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఏకంగా ఫుల్ మీల్స్ పెట్టినంత పని చేసింది మాళవిక మోహనన్. అయినా ఆడవాళ్ల నోట్లో ఏ న్యూస్ ఆగదంటారు కదా..! ప్రభాస్ రాజా సాబ్ గురించి కూడా అలాంటి అదిరిపోయే న్యూసులు చెప్పేసారు ఈ బ్యూటీ. మరింతకీ ఈ భామ చెప్పిందేంటి..? ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు ఓకే చెప్పడం గొప్ప కాదు.. ఒప్పుకున్న సినిమాలన్నీ ఒకేసారి పూర్తి చేయడం గొప్ప.
Updated on: Dec 08, 2024 | 3:53 PM

ప్రభాస్ సినిమాల గురించి చిన్న అప్‌డేట్ తెలిస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఏకంగా ఫుల్ మీల్స్ పెట్టినంత పని చేసింది మాళవిక మోహనన్.

అయినా ఆడవాళ్ల నోట్లో ఏ న్యూస్ ఆగదంటారు కదా..! ప్రభాస్ రాజా సాబ్ గురించి కూడా అలాంటి అదిరిపోయే న్యూసులు చెప్పేసారు ఈ బ్యూటీ. మరింతకీ ఈ భామ చెప్పిందేంటి..?

ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు ఓకే చెప్పడం గొప్ప కాదు.. ఒప్పుకున్న సినిమాలన్నీ ఒకేసారి పూర్తి చేయడం గొప్ప. అందులో ప్రభాస్ అందరికంటే ముందున్నారు.

ఓ వైపు హను రాఘవపూడి సినిమా పూర్తి చేస్తూనే.. ఈ గ్యాప్‌లోనే మారుతి రాజా సాబ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు హీరోయిన్ మాళవిక మోహనన్.

రాజా సాబ్ షూటింగ్ మొదలై చాలా రోజులైపోయింది. కల్కి, సలార్ లాంటి భారీ సినిమాల మధ్య.. ఖాళీ టైమ్ దొరికినపుడు మారుతి సినిమాకు డేట్స్ ఇస్తూ వచ్చారు ప్రభాస్.

అయితే కల్కి విడుదలయ్యాక.. ఫోకస్ అంతా రాజా సాబ్‌పైనే పెట్టారు ప్రభాస్. తాజాగా రాజా సాబ్ షూటింగ్ చివరిదశకు వచ్చేసిందని.. చెప్పిన డేట్‌కు సినిమా తీసుకొచ్చేలా మారుతి తెరకెక్కిస్తున్నారని తెలిపారు మాళవిక మోహనన్.

ఓ వైపు రాజా సాబ్ షూటింగ్ చేస్తూనే.. మరోవైపు ఫౌజీపైనా ఫోకస్ చేసారు ప్రభాస్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కొత్తమ్మాయి ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు హను. మరోవైపు హార్రర్ కామెడీగా రాజా సాబ్ వస్తుంది. ఇందులో మాళవిక మోహనన్‌తో పాటు రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.




