- Telugu News Photo Gallery Cinema photos Kollywood stars are guiding their next generation on Rapo with the Telugu industry.
Kollywood: తెలుగు ఇండస్ట్రీతో ర్యాపో.. తమ వారసులకు కోలీవుడ్ స్టార్స్ గైడ్..
తెలుగు ఇండస్ట్రీ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. సీనియర్లు, జూనియర్లన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తెలుగు ఇండస్ట్రీతో మంచి ర్యాపో మెయింటెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుతో ఆల్రెడీ టచ్ ఉన్న సెలబ్రిటీలు... తమ వారసులకు ఈ విషయంలో గైడ్ చేస్తున్నారు..
Updated on: Dec 08, 2024 | 2:46 PM

ఆల్రెడీ లాస్ట్ సినిమా ఇదేనంటూ దళపతి 69ని అనౌన్స్ చేసిన విజయ్, గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీ మీద స్పెషల్‌గా ఫోకస్ చేశారు. కెరీర్‌లో బిగ్ నెంబర్స్ అచీవ్ చేయాలంటే టాలీవుడ్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నారు విజయ్.

ఇప్పుడు తనయుడు జేసన్‌కి కూడా ఆ విషయాన్నే గట్టిగా చెబుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హీరో సందీప్ కిషన్‌తో జేసన్ ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

విజయ్ మాత్రమే కాదు, విక్రమ్ కూడా తెలుగు మార్కెట్ మీద ఎప్పటి నుంచో ఇష్టం పెంచుకున్నారు. అపరిచితుడు కన్నా ముందు నుంచే తన ప్రతి సినిమానూ తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్‌గా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు విక్రమ్. ఆయన తనయుడు ధ్రువ్ కూడా త్వరలో తెలుగు కెప్టెన్‌తో సినిమా చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.

ఇటు శంకర్ అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్‌తో తెలుగు డైరక్టర్‌గానే మారిపోయారు. కియారా అద్వానీ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే శంకర్ కుమార్తె అదితి శంకర్ కూడా తెలుగు ఇండస్ట్రీ మీద స్పెషల్‌గానే కాన్‌సెన్‌ట్రట్ చేస్తున్నారు. సో... కెరీర్‌లో బిగ్ నెంబర్స్ తో, బిగ్ మార్కెట్‌ని టచ్ చేయాలంటే.. తెలుగు సపోర్ట్ మస్ట్ అనే విషయం వారసులకు కెరీర్ స్టార్టింగ్‌లోనే అర్థం అయిందంటున్నారు క్రిటిక్స్.




