Directors: యువ దర్శకులదే హవా అంతా.. అందరు వారి వైపే..

అందరికీ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ కావాలంటే ఎలా..? అలా కుదరదు కదా.. పైగా ఒక్కో సినిమాకు వాళ్లు ఏళ్ళకేళ్లు తీసుకుంటారాయే..! అందుకే ఉన్న దర్శకులతోనే సర్దుకుంటున్నారు మన హీరోలు. పైగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కుర్ర దర్శకులదే హవా. అక్కడున్నది పవన్, ప్రభాస్, చరణ్, చిరు అని లెక్కలేం లేవు.. అందరి అడుగులు కుర్ర దర్శకుల వైపు వెళ్తున్నాయి. ఆ డైరెక్టర్స్‌పైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

| Edited By: Prudvi Battula

Updated on: May 27, 2024 | 9:00 AM

రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్.. వీళ్ళందరూ పేరుకు దర్శకులే కానీ క్రేజ్‌లో హీరోలతో సమానం. కొరటాల, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు సైతం తమదైన మార్క్‌తో ముందుకెళ్తున్నారు. అయితే వీళ్లంతా ఒక్కో సినిమాకు ఏళ్ళకేళ్లు టైమ్ తీసుకుంటారు. దీన్నే సుజీత్, వశిష్ట లాంటి కుర్ర దర్శకులు యూజ్ చేసుకుంటున్నారిపుడు.

1 / 5
 టాలీవుడ్‌లో ఇప్పుడు యంగ్ బ్యాచ్‌దే హవా. స్టార్ హీరోలు కూడా వాళ్లే కావాలంటున్నారు. మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలే ఎక్కువగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ అంటున్నారు కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. కుర్రాళ్ల వైపే వచ్చేసారు. గేమ్ ఛేంజర్ చేస్తూనే.. బుచ్చిబాబుకు ఛాన్సిచ్చారు చరణ్. అలాగే ఎన్టీఆర్ కూడా దేవర పూర్తయ్యాక.. ప్రశాంత్ నీల్ వైపు వెళ్తున్నారు.

2 / 5
 రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో కల్కి తెరకెక్కిస్తున్నారు. ఆ మేకింగ్ చూస్తుంటేనే ఆయన విజన్ అర్థమైపోతుంది. సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేయబోతున్నారు. ఈయన అనుభవం కూడా రెండు సినిమాలే.

3 / 5
ఇక విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సంక్రీత్యన్, రవికిరణ్ కోలా లాంటి కుర్ర దర్శకులే పని చేస్తున్నారు.ఓజితో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్న సుజీత్ అనుభవం రెండు సినిమాలే.. వయసు 30 మాత్రమే.

4 / 5
అలాగే హనుమాన్‌తో ఇండియాను తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ.. నెక్ట్స్ రణ్‌వీర్ సింగ్‌తో పని చేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర దర్శకుడు వశిష్టకు ఒక్క సినిమా అనుభవమే ఉంది. అలాగే వెంకీ అట్లూరి, శ్రీకాంత్ ఓదెల, చందూ మొండేటి లాంటి కుర్ర దర్శకులు కూడా కుమ్మేస్తున్నారు.

5 / 5
Follow us
Latest Articles