- Telugu News Photo Gallery Cinema photos Heroine Kriti Sanon Waiting for success in South Films may 2024 Telugu Actress Photos
Kriti Sanon: సౌత్ లో సక్సెస్ అయితే చాలు.. కృతి సనన్ ఎదురుచూపులు.
కృతి సనన్ సడన్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్ లాగా మాట్లాడుతున్నారు. రాబోయే సినిమాలో అలాంటి కేరక్టర్ చేస్తున్నారేమో.. అందుకే ఇలా రిహార్సల్స్ చేస్తున్నారేమో అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఈ నార్త్ లేడీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి డికేడ్ కంప్లీట్ అయింది. అందుకే ఉన్నపళాన ఈ అవతార్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు ఈ బ్యూటీ. నేను చేయగలిగాను అంటే, మీరూ చేయగలుగుతారు అంటూ తన పదేళ్ల కెరీర్‌ని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ నటి కృతి సనన్.
Updated on: May 27, 2024 | 1:26 PM

కృతి సనన్ సడన్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ టీచర్ లాగా మాట్లాడుతున్నారు. రాబోయే సినిమాలో అలాంటి కేరక్టర్ చేస్తున్నారేమో.. అందుకే ఇలా రిహార్సల్స్ చేస్తున్నారేమో అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు.

ఆదిపురుష్‌లో కృతి సనన్.. సాహోలో శ్రద్ధా కపూర్.. ఇలా నార్త్ బ్యూటీస్‌కే ఓటేస్తున్నారు ప్రభాస్ దర్శకులు. వాళ్ల వల్ల పాన్ ఇండియన్ అప్పీల్ ఉంటుంది. తాజాగా NTR, ప్రశాంత్ నీల్ సినిమాలో అలియా భట్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

పదేళ్ల సినిమా ప్రయాణంలో తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు కృతి. వ్యక్తిగా, నటిగా ఎంతో ఎదిగినట్టు తెలిపారు.

ఆనందాన్ని పంచే పలు అనుభవాలను మూటగట్టుకున్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఈ నార్త్ బ్యూటీ. తన జీవితంలో ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఈ దశాబ్దం మాత్రం చాలా స్పెషల్ అని చెప్పారు

నేషనల్ అవార్డు అందుకోవడం, అసలు ఏమాత్రం తెలియని భాషల్లో నటించడం, ఎప్పుడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్లి కొత్త వ్యక్తులను కలవడం..

ఇలా అన్నీ చాలా స్పెషల్ అని అన్నారు నార్త్ మిమి. నార్త్ వరకు ఈ భామకు అంతా బాగానే ఉంది. కానీ సౌత్ స్టార్లతో చేసిన సినిమాలు మాత్రం కలిసి రావడం లేదు.

నియర్ ఫ్యూచర్‌లో అయినా సౌత్‌లో సింగిల్ హిట్ తెచ్చుకుంటే బావుంటుందని భావిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ ఒక్క కోరికా తీరితే చాలంటున్నారు. ఫ్యాన్స్ కోసం డిఫరెంట్ కంటెంట్‌ని ప్రొవైడ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేశారు సిల్వర్‌స్క్రీన్ జానకి.




