- Telugu News Photo Gallery Cinema photos Hero Akhil Akkineni next Project after agent Movie details Telugu Heroes Photos
Akhil Akkineni: అఖిల్ అక్కినేని సైలెంట్ అయ్యారా.? ఏజెంట్ తరువాత బయటకు రాని అఖిల్.
ఏజెంట్ తర్వాత ఎందుకు అఖిల్ సైలెంట్ అయిపోయారు..? ఊహించిన దానికంటే ఎక్కువ ఎఫెక్టే అఖిల్ కెరీర్‌పై ఈ సినిమా చూపించిందా..? ఇప్పటికీ ఏజెంట్ ఇచ్చిన షాక్ నుంచి అక్కినేని వారసుడు బయటికి రాలేకపోతున్నారా లేదంటే లోపలే ఏదైనా ఇంకా పెద్ద ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా..? 2023ని వదిలేసి.. కొత్త ఏడాదిపై ఫోకస్ చేసారా..? అసలు 2024లో అఖిల్ ఏం చేయబోతున్నారు..? ఈ పాట అఖిల్ కెరీర్‌కు భలే సెట్ అవుతుందిప్పుడు.
Praveen Vadla | Edited By: Anil kumar poka
Updated on: Dec 16, 2023 | 9:09 PM

ఏజెంట్ తర్వాత ఎందుకు అఖిల్ సైలెంట్ అయిపోయారు..? ఊహించిన దానికంటే ఎక్కువ ఎఫెక్టే అఖిల్ కెరీర్‌పై ఈ సినిమా చూపించిందా..? ఇప్పటికీ ఏజెంట్ ఇచ్చిన షాక్ నుంచి అక్కినేని వారసుడు బయటికి రాలేకపోతున్నారా లేదంటే లోపలే ఏదైనా ఇంకా పెద్ద ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారా..?

2023ని వదిలేసి.. కొత్త ఏడాదిపై ఫోకస్ చేసారా..? అసలు 2024లో అఖిల్ ఏం చేయబోతున్నారు..? ఈ పాట అఖిల్ కెరీర్‌కు భలే సెట్ అవుతుందిప్పుడు. నిజంగానే కెరీర్ గురించి ఏవేవో కలలు కన్నారు కానీ ఒక్కటి కూడా నిజం అవ్వట్లేదు.. ఏమో ఏమైందో అన్నట్లే ఉంది అయ్యగారి పరిస్థితి.

ఒక్క హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉండిపోయారీయన. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కంటితుడుపే కానీ.. సూపరేం కాదు. ఇక ఏజెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏజెంట్ తర్వాత మళ్లీ భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లడానికి అఖిల్ భయపడతారేమో..

ఓసారి ఆలోచిస్తారేమో అనుకున్నారంతా. కానీ అయ్యగారక్కడ.. ఆయనెందుకు తగ్గుతాడు చెప్పండి..? అందుకే నెక్ట్స్ కూడా భారీ బడ్జెట్‌తోనే రాబోతున్నారు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌తోనే వచ్చేస్తున్నారు అక్కినేని వారసుడు.

సాహో, రాధే శ్యామ్ సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేసిన అనిల్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. అఖిల్ హీరోగా యువీ క్రియేషన్స్, రామ్ చరణ్ V మెగా పిక్చర్స్ సంయుక్తంగా ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే.. 2024 ఫిబ్రవరి నుంచి మరో సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నారు అఖిల్.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా ఉండబోతుంది. ఏడాదికి ఓ సినిమా అఖిల్‌తో ఉంటుందని గతంలోనే క్లారిటీ ఇచ్చింది అన్నపూర్ణ కంపౌండ్. మొత్తానికి ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు అక్కినేని వారసుడు.





























