- Telugu News Photo Gallery Cinema photos Bhagyashri Borse introducing in Tollywood industry with Raviteja new movie telugu cinema news
Bhagyashri Borse: మాస్ మహారాజా సరసన కొత్త హీరోయిన్.. రవితేజకు జోడిగా పూణే బ్యూటీ..
తెలుగు తెరకు మరో కొత్త హీరోయిన్ పరిచయం కాబోతుంది. పూణేకు చెందిన మోడల్ భాగ్య శ్రీ బోర్సే.. మాస్ మాహారాజా రవితేజ సరసన నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది. మాస్ మాహారాజాకి క్లాస్ మహారాణి అంటూ భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈసినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షాక్, మిరపకాయ్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇందులో కొత్త కథానాయిక.
Updated on: Dec 16, 2023 | 9:14 PM

తెలుగు తెరకు మరో కొత్త హీరోయిన్ పరిచయం కాబోతుంది. పూణేకు చెందిన మోడల్ భాగ్య శ్రీ బోర్సే.. మాస్ మాహారాజా రవితేజ సరసన నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది. మాస్ మాహారాజాకి క్లాస్ మహారాణి అంటూ భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈసినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షాక్, మిరపకాయ్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇందులో కొత్త కథానాయిక.

భాగ్యశ్రీ బోర్సే.. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఈ ఏడాది వచ్చిన యారియన్ 2 అనే హిందీ సినిమాలో కనిపించింది.

ఇక ఇప్పుడు నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. మొదటి సినిమాతోనే మాస్ మాహారాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.





























