Film News: గుంటూరుకారం అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ.. నా సామి రంగ వీడియో గ్లింప్స్..

గుంటూరుకారం లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. శ్రీలీలను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నా అన్నారు బ్లాక్ బస్టర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ. హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకోన్‌ జంటగా నటించిన ఫైటర్‌ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Dec 16, 2023 | 3:56 PM

గుంటూరుకారం లేటెస్ట్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు.

1 / 5
శ్రీలీలను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నా అన్నారు బ్లాక్ బస్టర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. హాయ్ నాన్న సినిమా చూసిన శ్రీలీల చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన మృణాల్, 'ఓ వైపు స్టడీస్ కంటిన్యూ చేస్తూ నటిగా కొనసాగటం అంటే మామూలు విషయం కాదు, నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ రిప్లై ఇచ్చారు.

2 / 5
నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా నరేష్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ సినిమాలో ఆశికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

3 / 5
హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకోన్‌ జంటగా నటించిన ఫైటర్‌ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. ఫస్ట్ ఏరియల్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కుతోంది ఫైటర్‌. ఆల్రెడీ విడుదలైన మూవీ టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు పఠాన్‌, వార్ సినిమాలు రూపొందించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు.

4 / 5
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నడక మార్గంలో తిరుమల చేరుకున్న దీపిక, ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం చేసుకున్నారు. దర్శనం తరువాత రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

5 / 5
Follow us