- Telugu News Photo Gallery Cinema photos Faster Shoots, Quicker Releases How Telugu Cinema is Breaking the Old Rules
రూల్స్‌ను బ్రేక్ చేసి హీరోలను పరిగెత్తిస్తున్న డైరెక్టర్స్
స్టార్ హీరోల సినిమా అంటే ఏళ్ల తరబడి చెక్కాల్సిందే అన్న రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు మన దర్శకులు. ఇన్నాళ్లు చేసినట్టుగా ఒకే సినిమా సంవత్సరాల పాటు వర్క్ చేయకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ఫినిష్ చేసేలా ప్రీపేర్ అవుతున్నారు. అందుకోసం హీరోలతోనూ పరుగులు పెట్టిస్తున్నారు. అప్ కమింగ్ లిస్ట్‌లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నారు.
Updated on: Jul 22, 2025 | 6:09 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మూవీ చేస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమాను జెట్ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు. షూటింగ్ మొదలు కాకముందే రిలీజ్ డేట్‌ను లాక్ చేసి తన మేకింగ్ స్టైల్ మీద తనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రూవ్ చేశారు.

అనుకున్నట్టేగానే డెడ్‌లైన్‌ను రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. మెగా నెలాఖరున చిరంజీవి సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశారు అనిల్. ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేశారు.

మరో రెండు నెలల్లో షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రీసెంట్ టైమ్స్‌లో చిరంజీ అత్యంత వేగంగా ఫినిష్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయబోతోంది మెగా 157.

అన్నయ్య స్పీడును మ్యాచ్ చేసేలా స్పీడు చూపిస్తుననారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పొలిటికల్ బిజీగా కారణంగా సినిమాలకు ఎక్కువ టైమ్ ఇవ్వలేకపోతున్నారు పవర్ స్టార్. అందుకే వీలైనంత తక్కువ టైమ్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ ఫినిష్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. మూడు నెలల్లోనే పవన్ సినిమాను ఫినిష్ చేయాలన్నది హరీష్ ప్లాన్.

రవితేజతో సినిమా స్టార్ట్ చేసిన కిశోర్ తిరుమల కూడా ఇదే స్పీడు చూపిస్తున్నారు. చాలా కాలం తరువాత మాస్ మహరాజ్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావటంతో ఆర్‌టీ 76 మీద మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాను కూడా ఆరు నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్‌కు రెడీ చేసేలా కష్టపడుతున్నారు కిశోర్ తిరుమల. మాస్ జాతర తరువాత రవితేజను డిఫరెంట్ యాంగిల్‌లో చూపించబోతున్నారు.




