- Telugu News Photo Gallery Cinema photos Tollywood Leading Ladies Anushka Rashmika Box Office Clash in September
రిలీజ్ కు ముందే టాప్ హీరోయిన్‌ల మధ్య క్రేజీ ఫైట్..
ప్రజెంట్ అందరూ సెప్టెంబర్ 25న జరగబోయే హీరోల క్లాష్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకన్నా ముందే అదే నెలలో ఇద్దరు టాప్ హీరోయిన్‌ల మధ్య కూడా బిగ్ ఫైట్ జరగనుంది. రెండు క్రేజీ లేడీ ఒరియంటెడ్ మూవీస్ ఒకే డేట్‌కు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు? ఏంటా మూవీస్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.
Updated on: Jul 22, 2025 | 8:10 PM

ప్రజెంట్ అందరూ సెప్టెంబర్ 25న జరగబోయే హీరోల క్లాష్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ అంతకన్నా ముందే అదే నెలలో ఇద్దరు టాప్ హీరోయిన్‌ల మధ్య కూడా బిగ్ ఫైట్ జరగనుంది. రెండు క్రేజీ లేడీ ఒరియంటెడ్ మూవీస్ ఒకే డేట్‌కు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు? ఏంటా మూవీస్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

అనుష్క లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటీ. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో డిలే అవుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది

ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఘాటీ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ డేట్‌కు ఏ సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఘాటీ రిలీజ్‌కు అదే పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు.

అనుష్క ఘాటీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న అదే డేట్‌కు ది గర్ల్‌ఫ్రెండ్‌గా వచ్చే ఆలోచనలో ఉన్నారట రష్మిక మందన్న. ఇప్పటికే ఆలస్యమైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లాన్.

ఒకే డేట్‌కు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అది కూడా ఇద్దరు టాప్ బ్యూటీస్ నటించిన సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండటంతో సెప్టెంబర్ 5 మీద కూడా ఫోకస్ పెరిగింది. నిజంగానే ఈ అందాల భామలు క్లాష్‌కు రెడీ అవుతారా..? లేదంటే కాంప్రమైజ్ అవుతారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.