- Telugu News Photo Gallery Priyanka jain shared photos of enjoying the streets of new york with her boyfriend
ప్రేమలో తేలిపోతున్న లవ్ బర్డ్స్.. రోడ్డుపై ఏంటి ఆ పని అంటున్న ఫ్యాన్స్!
అందాల చిన్న మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ బ్యూటీ న్యూయార్క్ వీధుల్లో తన ప్రియుడితో సందడి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓలుక్ వేయండి మరి!
Updated on: Jul 22, 2025 | 9:21 PM

అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ఈ బ్యూటీ ,ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలతో కుర్రకారును మాయ చేస్తుంటుంది. అంతే కాకుండా తన లవర్‌తో ఎంజయ్ చేస్తన్న ఫొటోస్ కూడా నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది.

ప్రియాంక జైన్, నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లు రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక చాలా రోజుల నుంచి వీరి పెళ్లి వార్తలపై అనేక గాసిప్స్ వస్తున్నాయి. ఎంగేజ్ మెంట్, త్వరలో పెళ్లి అంటూ అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. కానీ వీటిపై ఎప్పుడూ ఈ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే రీసెంట్‌గా ఈ అమ్మడు పలు ఇంటర్వ్యూలలో వచ్చే సంవత్సరంలో తప్పక పెళ్లి పీటలెక్కుతాం అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ లవ్ బర్ట్స్ ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పలేనేది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో అందరినీ మాయ చేస్తుంటుంది ఈ బ్యూటీ.

ఇక మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, చెల్తే చల్తే అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. కానీ ఈ అమ్మడుకు అంతగా ఫేమ్ రాలేదనే చెప్పాలి. కానీ సీరియల్స్ ద్వారా స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇక బిగ్గెస్ట్ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తన ఆటతీరుతో ఎంతో మంది మనసు దోచుకుంది. ఇక హౌస్ నుంచి వచ్చాక ఈ బ్యూటీ తన గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేసేది. కానీ తాజాగా తన లవర్‌తో అమెరికా వీధుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోల్లో వీరు కాస్త హద్దులు మీరడంతో.. నడి రోడ్డు పై ఏంటీ ఆ రొమాన్స్ మీరు ఇంకా మారరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



