- Telugu News Photo Gallery Spiritual photos Mars in Virgo: Financial Gains for 5 Zodiac Signs Details in Telugu
శని, కుజుల వైరం…ఈ రాశులకు ఐశ్వర్య, ధన యోగాలు పట్టబోతున్నాయ్..!
ఈ నెల(జులై) 28న కుజ గ్రహం కన్యారాశిలోకి మారుతోంది. అక్కడ సెప్టెంబర్ 14 వరకూ కొనసాగుతుంది. కుజుడి కన్యా రాశి ప్రవేశం వల్ల మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడితో సమ సప్తక దృష్టి ఏర్పడుతుంది. ఈ రెండు పాప గ్రహాల మధ్య, అందులోనూ బద్ధ శత్రువుల మధ్య పరస్పర దృష్టి ఏర్పడడం వల్ల కొన్ని రాశులకు ఐశ్వర్య యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల మధ్య దృష్టి ఏర్పడినప్పుడు సాధారణంగా ధన కాంక్ష, అధికార కాంక్ష పెరుగుతాయి. ఈ గ్రహాల వల్ల వృషభం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఊహించని ధన యోగాలు పట్టే అవకాశం ఉంది.
Updated on: Jul 22, 2025 | 7:18 PM

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడితో పంచమంలో ఉన్న కుజుడికి పరస్పర వీక్షణ ఏర్ప డడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఈ రాశివారికి శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయ ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. కోర్టు కేసులు, ఆస్తి వివాదాల పరిష్కారం మీద దృష్టి పెడతారు. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో ఉన్న శని, తృతీయ స్థానంలో ఉన్న కుజుడు పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన డబ్బును, బాకీలను, బకాయిలను రాబట్టుకుంటారు. ఆస్తిపాస్తుల విలువ బాగా వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చికం: లాభస్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడు, పంచమస్థానంలో ఉన్న శని పరస్పరం వీక్షించుకోవడం వల్ల ఉద్యోగంలో ప్రత్యర్థులు, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది.

మకరం: తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని, భాగ్య స్థానంలో ఉన్న కుజుడు సమ సప్తక దృష్టి కలిగి ఉన్నందువల్ల విదేశీ అవకాశాలు బాగా అందివస్తాయి. విదేశాల్లో ఉద్యోగ, నివాస స్థిరత్వానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్నపాటి ప్రయత్నం చేసినా అత్యధికంగా ఆదా యం వృద్ధి చెందుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మీనం: ఈ రాశిలో ఉన్న శనీశ్వరుడితో కుజుడికి పరస్పర దృష్టి ఏర్పడినందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం చాలావరకు తగ్గే అవకాశం ఉంది. శ్రమ తక్కువ లాభం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం యోగదాయకంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.



