శుక్రసంచారంతో అదృష్టం కలిసి వచ్చే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలియక, సంచారం అనేది సహజం. గ్రహాల కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. కొన్ని సార్లు గ్రహాలు సంచారం అనేది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అందులో కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తే మరికొన్ని రాశులకు సమస్యలు తీసుకొస్తుంది.
Updated on: Jul 22, 2025 | 9:18 PM

అయితే గ్రహాల్లో సంపదకు కారకుడైన శుక్రుడు జూలై 26న మిథునరాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా వారికి ఆదాయం పెరగడమే కాకుండా కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవడానికి మంచి సమయం. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కుంభ రాశి :కుంభ రాశి వారికి శుక్ర సంచారం వలన సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అని పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. చాలా రోజుల నుంచి దూరప్రయాణాలు చేయాలి అనుకునే వారి కల నెరవేరుతుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు అందుకుంటారు. తమ కలను నెరవేర్చుకుంటారు. ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి శుక్రుడి సంచారంతో అదృష్టం కలగ నుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. పట్టిందల్లా బంగారమే కానుంది. చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

తుల రాశి : శుక్ర సంచారంతో తుల రాశి వారు ఊహకందని లాభాలు అందుకోనున్నారు. ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుంది. ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. ఇంటా బయటసానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మిథున రాశి : శుక్రుడు సంపద కారకుడు కాబట్టి, శుక్ర సంచారంతో మిథున రాశి వారికి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో చింత అవసరం లేదు. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు పొందుతారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వస్తుంది.



