AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూత్ ఫుల్ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్.. కుర్ర హీరోలు ప్రతి ఒక్కరు దీని వైపే

అనుకుంటాం కానీ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్‌కు ఉన్న డిమాండ్ మరే జోనర్‌కు ఉండదేమో..? ఆ సినిమాలకు పెద్దగా కథ కూడా అవసరం లేదు.. మంచి ఫన్నీ ఎపిసోడ్స్ రాసుకుంటే చాలు..! అందుకే మన కుర్ర హీరోలకు ఈ జోనర్ మంచి ఆప్షన్ అయిపోయింది. తాజాగా మరిన్ని సినిమాలు కూడా ఇదే కోవలో వస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 22, 2025 | 6:33 PM

Share
ఈ మధ్య కాలంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్‌కు మంచి డిమాండ్ వచ్చేసింది. కాస్త కామెడీ ఉంటే చాలు యూత్ అంతా ఈ సినిమాకు ఎగబడిపోతున్నారు. గతేడాది ఆయ్ అయినా.. మొన్నొచ్చిన మ్యాడ్ అయినా.. సినిమా ఏదైనా అందులో ఎంటర్‌టైన్మెంట్ కామన్.

1 / 5
కాస్త బోల్డ్ టచ్ ఉన్నా కూడా.. బోలెడు కామెడీతో కాసులు కురిపించాయి ఆ సినిమాలు. యూత్ ఫుల్ సినిమాలకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకుని.. కుర్ర హీరోలు అలాంటి కథల వైపు వెళ్తున్నారు.

2 / 5
తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కే ర్యాంప్ టీజర్ విడుదలైంది. దిల్ రూబా ఫ్లాప్‌తో మనోడు పూర్తిగా రూట్ మార్చేసి.. ఎంటర్‌టైన్మెంట్ వైపు వచ్చేసారు. కే ర్యాంప్‌తో ర్యాంప్ ఆడించాలని ఫిక్సైపోయారు కిరణ్.

3 / 5
అక్టోబర్ 18న విడుదల కానుంది కే ర్యాంప్. మరోవైపు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో వస్తున్న విసా కూడా పూర్తిగా యూత్ ఫుల్ సినిమానే. అశోక్ గల్లా, శ్రీ గౌరీప్రియ ఇందులో జంటగా నటిస్తున్నారు. ఉద్భవ్ దర్శకుడు. ఈ సినిమా పూర్తిగా యుఎస్ బేస్డ్ నేపథ్యంలో వస్తుంది. టీజర్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది.

4 / 5
ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మిత్రమండలి కూడా యూత్ ఫుల్ ఎంటర్‌టైనరే. జాతి రత్నాలు, ఓం భీమ్ బుష్ తరహాలో సాగే పూర్తి కామెడీ కథ ఇది. ఈ సినిమాకు బన్నీ వాస్ సమర్పకుడిగా ఉన్నారు. మొత్తానికి యూత్ ఫుల్ సినిమాలన్నీ ఫుల్లుగా వచ్చేస్తున్నాయిప్పుడు.

5 / 5