- Telugu News Photo Gallery Cinema photos Do You Know Who Is The Actress In this Photo, She Is Heroine Aishwarya Lekshmi
Tollywood: అప్పుడు క్యూట్‌గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు గ్లామర్ డోస్‌తో గత్తరలేపుతోందిగా.. డాక్టర్ కమ్ హీరోయిన్..
తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ. డాక్టర్ అయిన అమ్మాయి హీరోయిన్ అయ్యింది. అనుకోకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ. 2017లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస హిట్స్ అందుకుంది.
Updated on: Sep 12, 2024 | 8:58 PM

తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ. డాక్టర్ అయిన అమ్మాయి హీరోయిన్ అయ్యింది. అనుకోకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ.

2017లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస హిట్స్ అందుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యాక సినిమాల్లోకి ఐశ్వర్య అడుగుపెట్టింది.

2014లో మోడలింగ్ రంగంలో యాక్టివ్‌గా ఉన్న ఐశ్వర్య 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత మాయనది చిత్రంలో అపర్ణ పాత్రలో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఓటీటీలో విడుదలైన అమ్ము సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఒకప్పుడు వరసు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఐశ్వర్యకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఐశ్వర్య.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో ఎంపికైంది.




