2024లోనే బెస్ట్ రిలీజ్ డేట్స్‌లో ఎప్రిల్ 5 ఒకటి. 5, 6, 7 తేదీలు వీకెండ్ అయితే.. ఎప్రిల్ 9న ఉగాది.. 11న ఈద్ హాలీడే రానుంది.. ఇక ఎప్రిల్ 14న సండే, 17న శ్రీ రామనవమి ఉన్నాయి. ఈ లెక్కన రెండు వారాల్లో వీకెండ్ సహా.. 3 పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. అందుకే ఫ్యామిలీ స్టార్ ఆ డేట్‌కు తీసుకొస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా వస్తుందంటే.. ఎన్టీఆర్ దేవర అధికారికంగా వాయిదా పడినట్లే.