Senior Heroes: సీనియర్ హీరోల చూపులన్నీ యువ దర్శకులపైనే.. ఇదే నయా హిట్ ఫార్ములా..
సీనియర్ హీరోలు స్టైల్ మార్చేస్తున్నారు.. అనుభవం ఉండాలి.. స్టార్ డైరెక్టర్లే కావాలి అంటూ పట్టు బట్టకుండా హాయిగా కుర్రాళ్ళతో సినిమాలకు సై అంటున్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్స్ కూడా తాము చిన్నప్పటి నుంచి చూసిన పెరిగిన హీరోలను.. తమకు నచ్చినట్లుగా చూపించాలని ఫిక్సైపోయారు. ఈ తరహా యంగ్, సీనియర్ కాంబినేషన్స్‌కు డిమాండ్ బాగా ఉందిప్పుడు.