Sankranthi Movies: హీరోలందారికి సంక్రాంతినే టార్గెటా.? మిగిలిన పండగలను మర్చిపోయారా.?

సంవత్సరంలో సంక్రాంతి ఒక్కటే పండగ ఉందా..? కేలండర్‌లో మిగిలిన పండగలు, అప్పుడు వచ్చే సెలవులు నిర్మాతలకు అస్సలు కనిపించడం లేదా..? పొంగల్‌కు వస్తే తప్ప మిగిలిన సీజన్స్‌లో సినిమాలు ఆడవా..? ఏ హీరో చూసినా సంక్రాంతి మాత్రమే కావాలని ఎందుకు ఖర్చీఫ్ వేస్తున్నారు..? ముందున్న క్రిస్మస్.. తర్వాత వచ్చే సమ్మర్.. ఆపై దసరాను ఎందుకు పట్టించుకోవట్లేదు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Feb 03, 2024 | 11:53 AM

సంవత్సరంలో సంక్రాంతి ఒక్కటే పండగ ఉందా..? కేలండర్‌లో మిగిలిన పండగలు, అప్పుడు వచ్చే సెలవులు నిర్మాతలకు అస్సలు కనిపించడం లేదా..? పొంగల్‌కు వస్తే తప్ప మిగిలిన సీజన్స్‌లో సినిమాలు ఆడవా..? ఏ హీరో చూసినా సంక్రాంతి మాత్రమే కావాలని ఎందుకు ఖర్చీఫ్ వేస్తున్నారు..? ముందున్న క్రిస్మస్.. తర్వాత వచ్చే సమ్మర్.. ఆపై దసరాను ఎందుకు పట్టించుకోవట్లేదు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

సంవత్సరంలో సంక్రాంతి ఒక్కటే పండగ ఉందా..? కేలండర్‌లో మిగిలిన పండగలు, అప్పుడు వచ్చే సెలవులు నిర్మాతలకు అస్సలు కనిపించడం లేదా..? పొంగల్‌కు వస్తే తప్ప మిగిలిన సీజన్స్‌లో సినిమాలు ఆడవా..? ఏ హీరో చూసినా సంక్రాంతి మాత్రమే కావాలని ఎందుకు ఖర్చీఫ్ వేస్తున్నారు..? ముందున్న క్రిస్మస్.. తర్వాత వచ్చే సమ్మర్.. ఆపై దసరాను ఎందుకు పట్టించుకోవట్లేదు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్..

1 / 5
మా సినిమా వచ్చే సంక్రాంతికి వస్తుందని ఏడాది ముందు గర్వంగా చెప్తున్నారు నిర్మాతలు. మరి అదే సినిమాను నెల రోజుల ముందుకు ఎందుకు రిలీజ్ చేయరంటే మాత్రం సమాధానం శూన్యం. పండక్కి వస్తేనే వసూళ్ళు వస్తాయా.. మిగిలిన టైమ్‌లో రావా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయిప్పుడు. 2025 సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ అంటే.. ఆ పండక్కి ఉన్న డిమాండ్ అర్థమైపోతుంది.

2 / 5
2025 సంక్రాంతికి ఇప్పట్నుంచే పోటీ కనిపిస్తుంది. ఇప్పటికే 4 సినిమాలు వస్తున్నాయని అనౌన్స్ చేసారు కూడా. అందులో చిరంజీవి విశ్వంభర, నాగార్జున బంగార్రాజు 2, ప్రశాంత్ వర్మ జై హనుమాన్, దిల్ రాజు శతమానం భవతి 2 ఉన్నాయి. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను కూడా పండక్కే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

3 / 5
ఏడాదిలో సమ్మర్, దసరా, దీవాళి, క్రిస్మస్ అంటూ ఇలా సీజన్స్ ఉన్నాయి. కానీ వాటినెవరూ పెద్దగా పట్టించుకోరు.. పట్టించుకున్నట్లు కూడా కనిపించడం లేదు. సమ్మర్ సీజన్‌ను అయితే రెండేళ్లుగా వదిలేస్తున్నారు హీరోలు. అందరిచూపు సంక్రాంతిపై మాత్రమే ఉంటుంది. 2023 సమ్మర్‌లో నాని, రవితేజ మాత్రమే వచ్చారు.. చూస్తుంటే ఈ సమ్మర్‌లోనూ నాని, రవితేజతో పాటు విజయ్ దేవరకొండ తోడయ్యారంతే.

4 / 5
సంక్రాంతికి వస్తే యావరేజ్ కూడా హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం. అది నిజమే అయ్యుండొచ్చు. పైగా పొంగల్‌కు 4 సినిమాలు వచ్చినా బాగానే ఆడతాయి. కానీ అదొక్క పండక్కే రావాలని అందరూ అనుకుంటే ఎలా..? ఇక్కడే నిర్మాతల లెక్కలు తప్పుతున్నాయి. సంక్రాంతికే వస్తేనే హిట్ అవుతుందనే భ్రమలోంచి నిర్మాతలు బయటికి రానంత వరకు సంక్రాంతికి యుద్ధాలు తప్పవు.

5 / 5
Follow us