AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: ఏమైనా తగ్గదేలే.! దేనికైనా సిద్దమే.. టెన్షన్‌ వద్దు అంటున్న దీపిక..

వస్తానా? రానా? అనే టెన్షన్‌ అసలు వద్దు... కచ్చితంగా వచ్చేస్తానని అంటున్నారు దీపిక పదుకోన్‌. ఆ మాటతో డార్లింగ్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కల్కి టీమ్‌ కూడా హుషారుగా కనిపిస్తోంది. ఇంతకీ దీపిక ఏ విషయంలో భరోసా ఇచ్చినట్టు.... డీటైల్స్ చూసేద్దాం... పదండి... గుడ్‌న్యూస్‌ చెప్పినప్పటి నుంచీ అందరి చూపూ దీపిక మీదే. ఆమె ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అంటూ... అదే పనిగా ఆరా తీస్తున్నారు జనాలు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Mar 05, 2024 | 4:30 PM

Share
వస్తానా? రానా? అనే టెన్షన్‌ అసలు వద్దు... కచ్చితంగా వచ్చేస్తానని అంటున్నారు దీపిక పదుకోన్‌. ఆ మాటతో డార్లింగ్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కల్కి టీమ్‌ కూడా హుషారుగా కనిపిస్తోంది. ఇంతకీ దీపిక ఏ విషయంలో భరోసా ఇచ్చినట్టు.... డీటైల్స్ చూసేద్దాం... పదండి...

1 / 5
గుడ్‌న్యూస్‌ చెప్పినప్పటి నుంచీ అందరి చూపూ దీపిక మీదే. ఆమె ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అంటూ... అదే పనిగా ఆరా తీస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా బాలీవుడ్‌లో అంబానీ ఇంట వేడుకలో భర్తతో కలిసి కాలు కదిపారు దీపిక. ప్రెగ్నెంట్‌గా ఉండి, డ్యాన్సులేశారా? అని ఆశ్చర్యంగా చెవులు కొరుక్కుంటున్నారు జనాలు.

2 / 5
దీపిక స్టెప్పులేశారన్న మాట కల్కి యూనిట్‌లోనూ, డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్ లోనూ సంబరాలు తెచ్చేసింది. ప్రెగ్నెన్సీని కారణంగా చూపించి, కల్కి ప్రమోషన్లకు ఆమె దూరమవుతారేమో అనే అనుమానం ఏమూలనో కాసింత వినిపించిన మాట వాస్తవం. ఇప్పుడు దీపికలో కనిపిస్తున్న హుషారు చూస్తే , ఆమె కచ్చితంగా ప్రమోషన్లలో పార్టిసిపేట్‌ చేస్తారనే భరోసా వచ్చేసింది అందరికీ.

3 / 5
గతంలో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఆలియా హాలీవుడ్‌ మూవీ షూటింగ్‌కి హాజరైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు జనాలు. రాహా కడుపులో ఉన్నప్పుడే యాక్షన్‌ సన్నివేశాలు కూడా చేశారు ఆలియా భట్‌. అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే, పని చేయొచ్చని చాలా సార్లు చెప్పారు ఆలియా.

4 / 5
కరీనా కూడా ప్రెగ్నెన్సీ టైమ్‌లో పనిచేశారు. తనను అపురూపంగా చూసుకునే యూనిట్‌ దొరికిందని, ఆమిర్ ఖాన్‌కి ధన్యవాదాలు కూడా చెప్పారు. చాలా మంది అమ్మాయిలు గర్భం దాల్చినా పనులు చేస్తూ ఉంటారని, హీరోయిన్లు కూడా అందుకు అతీతం కాదని అన్నారు కరీనా. ఇప్పుడు దీపిక కూడా అదే విషయాన్ని ప్రూవ్‌ చేస్తున్నారు.

5 / 5