Krithi Shetty: అక్కడ సినిమా అంటే ఎక్కువ గంటలు పనిచేయాల్సిందే.. కృతి శెట్టి..
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలో బిజీగా కథానాయికగా మారిపోయింది. కానీ కొన్నాళ్లకు తెలుగులో వరుస ప్లాపులు రావడంతో సైలెంట్ అయిపోయింది. ఇటీవలే మనమే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ కూడా బోల్తాపడింది. దీంతో ఇప్పుడు కృతికి తెలుగులో ఆఫర్స్ మాత్రం రావడం లేదు.