- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines trisha meenakshi chaudhary ashika ranganath are coming with hits movies with this sankranti 2025
Tollywood News: సంక్రాంతి సందడంతా మాదే అంటున్న టాలీవుడ్ బ్యూటీస్
పండగ సందడంతా థియేటర్లలో సినిమాలు దండిగా ఉండాలి. జస్ట్.. అంతే కాదండోయ్... ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి. కొందరు పర్ఫెక్ట్ కేరక్టరైజేషన్స్ తో మెప్పిస్తే, మరికొందరు గ్లామర్ యాంగిల్‌లో దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారు. 2025 ముగ్గుల పండగ మరింత కలర్‌ఫుల్‌గా కనిపించబోతోందంటున్నారు అబ్జర్వర్స్... పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకునే కాన్సెప్ట్ ఇప్పుడు త్రిషకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.
Updated on: Aug 26, 2024 | 10:00 PM

పండగ సందడంతా థియేటర్లలో సినిమాలు దండిగా ఉండాలి. జస్ట్.. అంతే కాదండోయ్... ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి. కొందరు పర్ఫెక్ట్ కేరక్టరైజేషన్స్ తో మెప్పిస్తే, మరికొందరు గ్లామర్ యాంగిల్‌లో దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారు. 2025 ముగ్గుల పండగ మరింత కలర్‌ఫుల్‌గా కనిపించబోతోందంటున్నారు అబ్జర్వర్స్...

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకునే కాన్సెప్ట్ ఇప్పుడు త్రిషకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అప్పుడెప్పుడో మెగాస్టార్‌తో త్రిష చేసిన స్టాలిన్ పెద్దగా ఆడలేదు. వాటన్నిటినీ పట్టించుకోకండీ... ఇప్పుడేంటన్నదే మెయిన్ అంటూ... విశ్వంభరలో యాక్ట్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

సంక్రాంతికి త్రిషతో పాటు చాలా మంది నాయికలు విశ్వంభర కోసం వెయిట్ చేస్తున్నారు. వారిలో ఒకరు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో హిట్ అందుకున్నారు మీనాక్షి. నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంభరతో పాటు, వెంకీ అనిల్ సినిమాలోనూ ఆడిపాడనున్నారు మిస్ మీనాక్షి.

విశ్వంభరలో ట్రెడిషనల్ డ్రస్సుల్లో కనిపిస్తానని ఆల్రెడీ అక్కడా ఇక్కడా చెబుతూనే ఉన్నారు సురభి. తన కేరక్టర్ ఏంటన్నది ఇప్పట్లో రివీల్ చేయడానికి ఇష్టపడటం లేదని అంటున్న ఈ బ్యూటీ, ఈ సినిమా మాత్రం తన లైఫ్‌లో చాలా స్పెషల్‌గా ఉంటుందని అంటున్నారు.

ఆషికా రంగనాథ్ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా... ప్రేక్షకుల గుండెల్లో మంచి ముద్రే వేసేశారు. ఆల్రెడీ ఈ సంక్రాంతికి పలకరించిన ఈ బ్యూటీ, నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంభరలో ఎలాంటి రోల్‌లో మెప్పిస్తారో చూడాలని ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ మరి...




