- Telugu News Photo Gallery Cinema photos Actor Vishal officially announces his engagement to actress Sai Dhanshika in presence of their families
గ్రాండ్‌గా విశాల్, సాయి ధన్సిక ఎంగేజ్మెంట్.. విషెస్ చెప్తున్నా అభిమానులు
తమిళ్ స్టార్ హీరో విశాల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు
Updated on: Aug 29, 2025 | 1:48 PM

తమిళ్ స్టార్ హీరో విశాల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు విశాల్. ఇదిలా ఉంటే విశాల్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. గతంలో విశాల్ హైదరాబాద్ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు.

ఇటీవలే తన వివాహం పై కూడా క్లారిటీ ఇచ్చాడు. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశాడు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో తాను పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక.

తాజాగా విశాల్, సాయి ధన్సిక ఎంగేజ్మెంట్ జరిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విశాల్ కు ఎంగేజ్మెంట్ జరగడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగనుందని తెలుస్తుంది. పెళ్లి పనులు మొదలయ్యాయి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. సాయి ధన్సిక రజినీకాంత్ నటించిన కబాలి సినిమాలో హీరో కూతురిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిందీ అందాల తార ప్రస్తుతం తమిళ్ లో సినిమాలు చేస్తుంది.