- Telugu News Photo Gallery Chinna Jeeyar Swamy, MyHome Chairman Jupalli Rameswara Rao and Executive Vice Chairman Ramurao invite PM Modi to Statue of Equality 3rd anniversary celebrations in Muchinthal
Statue Of Equality: సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు.
Updated on: Jul 31, 2025 | 5:13 PM

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిధిగా రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించారు. ఇందుకు ప్రధానమంత్రి మోదీ సానుకూలంగా స్పందించారు.

ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ ఉదయం డాక్టర్ రామేశ్వరరావ్, రామురావుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన చినజీయర్ స్వామి... హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను వివరించారు.

సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను ప్రధానికి తెలియజేశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు.

ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా. రామేశ్వరరావును అభినందించారు.
