- Telugu News Photo Gallery Business photos Gold Price Crash: Hyderabad, Vijayawada Latest Gold, Silver Rates, Future Predictions
గుడ్ న్యూస్ అంటే ఇది.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. భవిష్యత్తులో మరింత తగ్గనుందా..?
బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఇటీవల లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర ఇప్పుడు కొంత మేరకు వెనక్కి తగ్గింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయన్న వార్తలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివచ్చాయి. వెండి ధర కూడా తగ్గముఖం పట్టడం గమనార్హం.. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Updated on: Jun 28, 2025 | 12:30 PM


శనివారం బులియన్ మార్కెట్ ప్రకారం.. దేశియంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.97,420 లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 89,300 ఉంది. 24 క్యారెట్లపై రూ.600, 22 క్యారెట్లపై రూ.550 మేర ధర తగ్గింది. వెండి కిలో పై రూ.100 తగ్గి రూ.1,07,800 లుగా ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.97,420, 22 క్యారెట్ల బంగారం రూ.89,300లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.97,420, 22 క్యారెట్ల బంగారం రూ.89,300లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.97,570, 22 క్యారెట్ల బంగారం రూ.89,450, ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.97,420, 22 క్యారెట్ల బంగారం రూ.89,300, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.97,420, 22 క్యారెట్ల బంగారం రూ.89,300, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.97,420, 22 క్యారెట్ల బంగారం రూ.89,300 గా ఉంది.

అయితే.. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం, మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని.. విశ్లేషకులు చెబుతున్నారు. భారీగా తగ్గదు కానీ.. కొంతమేర ఊరటనిచ్చే అవకాశం మాత్రం ఉంది.




