AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‎కు.. 70 వసంతాల వేడుకలు

తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17వ తేదీన సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్న తనంనుంచే సాహిత్యం, కళలు, భాష, రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో లిటరేచన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా రాజకీయ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్ అంటే వీరాభిమానం.

Srikar T
|

Updated on: Feb 17, 2024 | 1:40 PM

Share
తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17వ తేదీన సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే బాల్యం, విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్న తనంనుంచే సాహిత్యం, కళలు, భాష, రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు.

1 / 5
ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో లిటరేచర్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా రాజకీయ తొలి అడుగు వేశారు. ఎన్టీఆర్ అంటే వీరాభిమానం. ఆయన స్ఫూర్తితో అన్నగారు పెట్టిన తెలుగుదేశంలో చేరారు.

2 / 5
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 21న తెలుగుదేశం పార్టీని వీడారు. డిప్యూటి స్పీకర్ పదవిని సైతం తృణప్రాయంగా పక్కన పెట్టారు. 2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీ స్థాపించారు. 2001కి ముందు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ రాజకీయాల్లో కీలకభూమిక పోషించారు.

3 / 5
1983లో అప్పటి మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ఇక అప్పటినుంచి నిర్విరామ అపజయాలు ఎరుగని నేతగా ఎదిగారు.

4 / 5
రాష్ట్ర సాధనతో ఆగిపోలేదు. ఏదో చేయాలనే తపనతో 2014 ఎన్నికల్లో స్థానికత అనే జెండాను, అభివృద్ది అనే జెండాలతో ప్రచారానికి వెళ్లారు. తెలంగాణ ప్రజలు ఉద్యమ సింహం కేసీఆర్ ని అధికారపీఠంపై కూర్చోబెట్టారు. తొలిసారి పాలనపగ్గాలు చేపట్టాక పూర్తిగా సంక్షేమ, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారు.

5 / 5