- Telugu News Photo Gallery If you drink pomegranate juice every day, you can say goodbye to heart attack, check here is details
Pomegranate for Heart Health: ఇది విన్నారా.. దానిమ్మ జ్యూస్ తాగితే గుండె పోటుకు బైబై చెప్పొచ్చు!
దానిమ్మ పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పండు గురించి తెలుసు. ఏ సీజన్‌లో అయినా పుష్కలంగా దానిమ్మ పండ్లు దొరుకుతాయి. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా.. వచ్చిన జబ్బులను కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. దానిమ్మ జ్యూస్‌లో రెడ్ వైన్ లేదా గ్రీన్ టీ కంటే మూడురెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మలో పాలీ..
Updated on: Feb 17, 2024 | 1:01 PM

దానిమ్మ పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పండు గురించి తెలుసు. ఏ సీజన్‌లో అయినా పుష్కలంగా దానిమ్మ పండ్లు దొరుకుతాయి. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. సరిగ్గా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా.. వచ్చిన జబ్బులను కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది.

దానిమ్మ జ్యూస్‌లో రెడ్ వైన్ లేదా గ్రీన్ టీ కంటే మూడురెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా దానిమ్మలో పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయ పడతాయి. అలాగే ధమనుల్లో బ్లాక్స్‌ను నిరోధి్తుంది.

అదే విధంగా ప్రతి రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయట. బీపీని నియంత్రించడంలో ఈ జ్యూస్ బాగా సహాయ పడుతుందని నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజూ దానిమ్మ పండు రసం తాగితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ప్రతి రోజూ దానిమ్మ రసం తాగితే గుండె పోటు రాదని తేలింది. దానిమ్మ తీసుకుంటే గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని వెల్లడించారు.

అంతే కాకుండా దానిమ్మ జ్యూస్ తాగితే.. క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటుంది. శరీరంలో ఉండే ట్యాక్సీన్లను, వ్యర్థాలు, మలినాలను బయటకు పంపేందుకు సహాయ పడుతుంది.





























