- Telugu News Photo Gallery Cinema photos Mahesh babu rajamouli ssmb29 movie title trending in social media
SSMB29: మహేష్, రాజమౌళి సినిమా టైటిల్ లీక్.. ఇదేం టైటిల్ భయ్యా అంటున్న ఫ్యాన్స్
రాజమౌళి సినిమాలకు కథలు కాదిప్పుడు.. టైటిల్ పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఏదో ఒక్కటే కామన్ టైటిల్ ఉండాలని ఆలోచిస్తున్నారు జక్కన్న. అందుకే మహేష్ కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా.. RRR ఫార్మాట్‌లోనే అదిరిపోయే టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఏంటా టైటిల్..? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి..? సాధారణంగా ప్రతీ సినిమా తర్వాత బాగా ఛిల్ అవుతుంటారు మహేష్ బాబు. కొన్ని రోజులు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చింత లేకుండా కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తుంటారు.
Updated on: Feb 17, 2024 | 12:40 PM

రాజమౌళి సినిమాలకు కథలు కాదిప్పుడు.. టైటిల్ పెట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఏదో ఒక్కటే కామన్ టైటిల్ ఉండాలని ఆలోచిస్తున్నారు జక్కన్న. అందుకే మహేష్ కోసం ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా.. RRR ఫార్మాట్‌లోనే అదిరిపోయే టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఏంటా టైటిల్..? అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి..?

సాధారణంగా ప్రతీ సినిమా తర్వాత బాగా ఛిల్ అవుతుంటారు మహేష్ బాబు. కొన్ని రోజులు నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చింత లేకుండా కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడలా లేదు పరిస్థితి. ఎందుకంటే నెక్ట్స్ ప్రాజెక్ట్ రాజమౌళితో కాబట్టి ఆ ప్రిపరేషన్‌లో ఉన్నారు మహేష్ బాబు. పైగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి.. అప్పుడే వర్కవుట్స్ కూడా మొదలుపెట్టారు సూపర్ స్టార్.

గుంటూరు కారం విడుదలయ్యాక.. ఈ మధ్యే జర్మనీ వెళ్లొచ్చారు మహేష్ బాబు. అది కూడా రాజమౌళి సినిమా కోసమే. అక్కడి విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్‌ను మహేష్ కలిసొచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే విషయంపైనా చర్చ బాగానే జరుగుతుంది. పాన్ వరల్డ్ కాబట్టి.. అన్ని భాషల్లోనే కాదు.. దేశాల్లోనూ ఒకే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.

ఇప్పటికైతే మహేష్, రాజమౌళి సినిమాను SSMB29 అంటున్నారు. దీనికిప్పుడు మహ రాజ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మహేష్ బాబు పేరులోని మొదటి మూడక్షరాలు MAH.. రాజమౌళి పేరులోని మొదటి మూడక్షరాలు RAJ కలిపి మహ రాజ్ ( MAH RAJ) టైటిల్ ప్లాన్ చేస్తున్నారు.

గతంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు టైటిల్ ఇలాగే పెట్టారు జక్కన్న. రామ్ చరణ్, రామారావు, రాజమౌళి పేర్లలోని మొదటి అక్షరాలతో RRR అనే వర్కింగ్ టైటిల్ పెట్టి.. చివరికి దాన్నే మెయిన్ టైటిల్‌గా మార్చారు. మహేష్ కోసం అదే చేస్తున్నారు జక్కన్న. తమ పేర్లలోని మొదటి మూడక్షరాలతో టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.




