Devara: బాబాయ్, అబ్బాయ్ బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్ధం అవుతున్నారా ?? వీరి మధ్య పోరు ఎలా ఉండబోతుంది ??
అంతా అనుకున్నదే.. కాకపోతే కాస్త ఆలస్యంగా చెప్పారు కొరటాల శివ. ముందు నుంచి చెప్తున్నట్లుగానే దేవర వాయిదా పడింది. సమ్మర్ వదిలేసినా.. మరో సాలిడ్ సీజన్‌పై కన్నేసారు తారక్. మరోవైపు అబ్బాయితో పోటీకి సై అంటున్నారు బాబాయ్. మరి దేవరను వెన్నంటే.. బాలయ్య కూడా వస్తున్నారా..? అదే నిజమైతే.. బాబాయ్ అబ్బాయ్ బాక్సాఫీస్ ఫైట్ ఎప్పుడు ఉండబోతుంది..? దేవర సినిమా వాయిదాపై క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే.. ఎప్రిల్ 5 నుంచి ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అయిపోయింది దేవర.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
