- Telugu News Photo Gallery Benefits of using a jumping rope for cardio and weight loss Telugu Lifestyle News
Skipping benefits: ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఇన్ని లాభాలా..? ఇప్పుడే మొదలు పెట్టేయండి ఇక..!
స్కిప్పింగ్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అదొక గొప్ప వ్యాయామం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లేందుకు వీలులేని వారి కోసం స్కిప్పింగ్ గొప్ప ఎక్సర్‌సైజ్ అవుతుంది. అతి తక్కువ ఖర్చుతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే గొప్ప మార్గం స్కిప్పింగ్. పైగా మనందరికీ ఈ స్కిప్పింగ్‌పై పట్టు ఉంటుంది. ఎందుకంటే.. చాలా మంది చిన్నతనంలో స్కిప్పింగ్ ఆడే ఉంటారు. అలాంటి స్కిప్పింగ్ కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 21, 2024 | 12:23 PM

స్కిప్పింగ్ అనేది కేవలం ఆట కాదు. ఇది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది మొత్తం శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. స్కిప్పింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్కిప్పింగ్ అనేది పూర్తి శరీరానికి వ్యాయామం. రోజూ అరగంట సేపు స్కిప్ చేయడం వల్ల మీ శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా స్కిప్పింగ్ గొప్ప వ్యాయామం.

స్కిప్పింగ్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. ఇది గుండె పనితీరును సజావుగా చేయడంలో సహాయపడుతుంది. గుండెను దృఢంగా మార్చడంతో పాటు, స్కిప్పింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీర సమతుల్యత, బలాన్ని మెరుగుపరచడానికి స్కిప్పింగ్ గొప్పగా పనిచేస్తుంది.

కొంచెం శ్రద్ధ, ఏకాగ్రమైన మనస్సుతో మాత్రమే స్కిప్పింగ్ సరిగ్గా చేయగలరు.. రెగ్యులర్ స్కిప్పింగ్ చేయటం వల్ల శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు దృఢంగా ఉండి శరీరానికి మరింత బలం చేకూరుతుంది. కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. స్కిప్పింగ్ ఆడ,మగ అనే తేడాలేకుండా..ఇద్దరిలోనూ నిమిషానికి 25 నుండి 30 కిలో కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

అంటే మీరు కేవలం అరగంటలో 600 కిలో కేలరీలు బర్న్ చేయవచ్చు. అంతేకాదు.. స్కిప్పింగ్‌తో మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఇతరాత్ర ఆలోచనలు మనసులో పెట్టుకుని స్కిప్పింగ్ చేయటం సాధ్యం కాదు. మీరు స్కిప్పింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత లేకపోతే, మీరు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, స్కిప్పింగ్ అలవాటు చేసుకోవడం వల్ల మీ ఏకాగ్రత మెరుగుపడుతుందని, మీ తెలివితేటలు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్కిప్పింగ్ అనేది సరళమైన వ్యాయామాలలో ఒకటిగా పరిగణిస్తారు ఆరోగ్య నిపుణులు. రోజుకు కేవలం 15 నిమిషాల స్కిప్పింగ్‌తో ఇన్ని ప్రయోజనాలు పొందుతారు. అది కూడా ఎలాంటి ఖర్చులేకుండానే.. మరీంకెందుకు ఆలస్యం ఈ వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి...





























